Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో రోడ్లు తవ్వేస్తున్నారు.... నిన్న అక్కడ.. నేడు ఇక్కడ

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (08:14 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో రోడ్లు రాత్రికి రాత్రే మాయమైపోతున్నాయి. అంటే.. రోడ్లను తవ్వేస్తున్నారు. 10 రోజుల క్రితం ఉద్దండరాయునిపాలెంలో రోడ్డును తవ్వేసి కంకరను తరలించిన ఘటనను మర్చిపోకముందే తాజాగా, మోదుగులింగాయపాలెంలో రోడ్డును తవ్వేశారు. 
 
గ్రామానికి ఉత్తరంగా ఉన్న సీడ్ యాక్సెస్ పక్కన ఉన్న రోడ్డును తవ్వేసిన గుర్తు తెలియని వ్యక్తులు కంకరను తరలించారు. ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చినప్పటికీ 10 రోజుల క్రితమే జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
 
నాలుగు అడుగుల లోతు, 200 మీటర్ల పొడవున రోడ్డును తవ్వేసిన దుండగులు దాదాపు 100 టిప్పర్ల కంకరను తరలించి ఉంటారని భావిస్తున్నారు. పెద్దగా జనసంచారం ఉండని ఈ ప్రాంతంలో టిప్పర్లు, జేసీబీలు తిరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. అర్ధరాత్రి ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
 
రోడ్డును తవ్వేసిన విషయం తెలిసిన వెంటనే అమరావతి దళిత జేఏసీ నాయకులు, వెలగపూడి రైతులు రోడ్డు తవ్వేసిన ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. రోడ్లను ధ్వంసం చేస్తూ రాజధాని అమరావతి నామరూపాల్లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రోడ్ల తవ్వకం, నిర్మాణ సామగ్రి చోరీపై న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments