Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూసీ కాల్వలో దూసుకెళ్లిన ట్రాక్టరు.. 14 మంది కూలీలు మృత్యువాత

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం వేములకొండ శివారు లక్ష్మాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు అదుపు తప్పిన ట్రాక్టరు రోడ్డు పక్కనే ఉన్న మూసీ కాల్వలోకి

Webdunia
ఆదివారం, 24 జూన్ 2018 (11:54 IST)
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం వేములకొండ శివారు లక్ష్మాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు అదుపు తప్పిన ట్రాక్టరు రోడ్డు పక్కనే ఉన్న మూసీ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ట్రాక్టరులో ప్రయాణిస్తున్న 14 మంది వ్యవసాయ కూలీలు మృతి చెందారు. మృతులంతా వలిగొండ మండలం నందనం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.
 
ప్రమాదానికి గురైన ట్రాక్టరులో 30 మంది వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్నారు. ఉపాధి హామీ పనుల కోసం వీళ్లు ట్రాక్టరులో వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని కేసీఆర్ ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments