Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా అనే నేను... కల నెరవేర్చుకున్న ఆర్కే.రోజా...

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (12:46 IST)
సినీ నటి, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా తన చిరకాల కల నెరవేర్చుకున్నారు. రోజా అనే నేను అంటూ ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా సోమవారం ప్రమాణం చేశారు. ఆమెతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఆమె నేరుగా వెళ్లి వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పాదాబివందనం చేశారు. ఆ తర్వాత గవర్నర్‌కు నమస్కరించారు. 
 
కాగా, సినీ నటిగా సుపరిచితులైన రోజా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఫైర్‌బ్రాండ్‌ మహిళగా గుర్తింపు పొందారు. ఇపుడు అదే పంథాలో కొనసాగుతున్నారు. వైకాపాలో చేరిన రోజమ్మ.. గత 2014లో జరిగిన ఎన్నికల్లో శాసనసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ ఛైర్‌పర్సన్‌గా కేబినెట్ హోదాలో కొనసాగుతున్నారు. 
 
అయితే, సీఎం జగన్ చేపట్టిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరించారు. ఇందులో రోజాకు మంత్రి పదవి కట్టబెట్టారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆమె వయసు 51 యేళ్లు. ఇంటర్ వరకు చదువుకున్న రోజా... చదువుకునే రోజుల్లోనే సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 1999లో రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో వైకాపా నుంచి తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో ఆమె రెండోసారి గెలుపొందారు. ఇపుడు ఏపీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments