Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మా... నన్ను అపార్థం చేసుకున్నారు, నా రక్తంలో పోరాటముంది: రోజా

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (19:18 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు అయేషా మీరా తల్లి. సరిగ్గా 12 సంవత్సరాలకు ముందు అయేషా మీరాను అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. 
 
అయితే ఈ ఘటన జరిగిన సమయంలో టిడిపి మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు రోజా. అప్పట్లో రోజా తీవ్రంగా స్పందించారు. అదలావుంటే అయేషా తల్లి మాట్లాడుతూ... నా కుమార్తె హత్య కేసులో సత్యం బాబు నిందితుడు కాదని నేను నెత్తి నోరు మొత్తుకున్నా. పట్టించుకోలేదు. నా కుమార్తె హత్య వెనుక రాజకీయ నేతల హస్తముంది. ఆ విషయం రోజాకు తెలుసు. కానీ ఆమె బయటకు చెప్పలేదు.
 
ప్రస్తుతం వారి పార్టీ అధికారంలో ఉంది.. ఇప్పుడు రోజా స్పందించాలి అంటూ ఆరోపించారు అయేషా మీరా తల్లి. దీనిపై తీవ్రంగా స్పందించారు రోజా. అయేషా మీరా తల్లిని... అమ్మా అంటూ సంబోధించిన రోజా, నా రక్తంలోనే పోరాటముంది. ఎక్కడ అమ్మాయికి అన్యాయం జరిగినా వెంటనే స్పందించే తత్వం నాది. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు.
 
మీరు నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అందులో ఎంతమాత్రం నిజం లేదు అంటున్నారు రోజా. ఎప్పుడైనాసరే మహిళల కోసం పోరాటం చేసే వారిలో నేను ముందువరుసలో ఉంటానని చెప్పారు రోజా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments