Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంచం అడిగిన రెవెన్యూ అధికారి.. అడ్డంగా బుక్ చేసిన రైతు..

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (17:23 IST)
లంచం అడిగిన అధికారులను రైతు అడ్డంగా బుక్ చేశాడు. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాడు. రైతు భూమికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేసేందుకు రూ 23 వేలు లంచం అడిగారు రెవెన్యూ అధికారులు. కడ్తాల్‌కు చెందిన రైతు ఎర్రోళ్ల వెంకటేశ్‌ తన పొలంలో షెడ్డు నిర్మించాలనుకున్నాడు. ఇందుకు రుణం పొందడానికి బ్యాంక్ అధికారులను సంప్రదించారు. 
 
రుణం ఇవ్వాలంటే భూమికి సంబంధించిన ఎన్వోసీ తీసుకురావాలని బ్యాంక్ అధికారులు సూచించారు. గతేడాది భూ దస్త్రాల ప్రక్షాళన సమయంలో వెంకటేశ్‌ ఎన్వోసీ కోసం రంగారెడ్డి జిల్లా మండల కేంద్రం కడ్తాల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. 1.25 గుంటల భూమికి ఎన్వోసీ మంజూరు చేయడానికి ఆర్‌ఐ శ్రవణ్‌కుమార్‌, నలుగురు సిబ్బంది రూ.23 వేలు లంచం అడిగారు. 
 
అది ఇచ్చుకోలేని రైతు ఏమి చేయాలో తోచక అనిశా అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు సోమవారం రెవెన్యూ సిబ్బందికి రైతు లంచం ఇస్తుండగా. అనిశా అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, ఐదుగురిపై కేసు నమోదు చేసారు. మంగళవారం వీరిని కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడ జైలుకు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. తనలాగే మరొకరికి జరగకూడదనే అనిశాని సంప్రదించానని రైతు చెప్పారు.

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments