Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రకు ఆవకాయ, తెలంగాణకు ధమ్ బిర్యానీ... బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్ విజయోత్సవం

Advertiesment
Bilalpur police stattion movie
, శనివారం, 16 మార్చి 2019 (19:15 IST)
మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘనా జంటగా నటించిన చిత్రం బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్. గోరటి వెంకన్న కీలక పాత్రలో నటించారు. ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళీ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగసాయి మాకం దర్శకుడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ సినిమా ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర విజయోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు.
 
ఈ సందర్భంగా నిర్మాత మహంకాళీ శ్రీనివాస్ మాట్లాడుతూ.... ఆంధ్రా ప్రజలకు పెరుగన్నం, ఆవకాయతో కలిపి తింటే ఇష్టం. తెలంగాణ వాళ్లకు ధమ్ బిర్యానీ తింటే సంతృప్తి. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ సినిమా చూస్తే అలాంటి సంతోషమే తెలుగు ప్రేక్షకులందరికీ దక్కుతుంది. విడుదలైన అన్ని కేంద్రాల నుంచి మా చిత్రానికి మంచి స్పందన వస్తోంది. తొలి చిత్రమే విజయం దక్కడం నిర్మాతగా మరిన్ని సినిమాలు చేసేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.
 
దర్శకుడు నాగసాయి మాకం మాట్లాడుతూ...విడుదల రోజు తొలి ఆట చూస్తున్నప్పుడు ఇన్నాళ్ల పాటు సినిమా కోసం పడిన కష్టాన్ని మర్చిపోయాం. అంత గొప్ప విజయాన్ని ప్రేక్షకులు అందించారు. సినిమా బాగుంటే కొత్త నటులు, పాత వాళ్లు అనే బేధం చూడరని ప్రేక్షకులు మరోసారి నిరూపించారని అన్నారు.
 
గోరటి వెంకన్న మాట్లాడుతూ...సినిమా బాగుందన్న స్పందన వస్తోంది. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రంలో హింస లేదు, అశ్లీలత లేదు, ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవు. కుటుంబమంతా హాయిగా చూసి ఆనందించవచ్చు. గీత రచయితగా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ మూడు ప్రాంతాల ప్రజలకు నచ్చేలా పాటలు రాశాను. ఇవాళ నేను నటించిన సినిమా కూడా తెలుగు వారందరికీ నచ్చడం సంతోషంగా ఉంది. నేను సహజంగా నటించానని అంతా అంటున్నారు. నాటక సమాజంలోని ప్రదర్శనలు నిత్యం చూసే అనుభవంతో, వాటిని గుర్తు తెచ్చుకుని నటించానని అన్నారు.
 
ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు శ్రీనాథ్, శాన్వీ మేఘనతో పాటు సంగీత దర్శకుడు సాబూ వర్గీస్, గీత రచయిత మౌనశ్రీ మల్లిక్ ఇతర నటీనటులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నరేష్... మార్చి 31 వరకూ 'మా' కుర్చీలో కూర్చుంటే ఖబడ్దార్? శివాజీరాజా బెదిరిస్తున్నారా?