Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద ఉధృతిలో చిక్కుకున్న ఇద్దరు రైతులని కాపాడిన రెస్క్యూ సిబ్బంది

Webdunia
గురువారం, 26 నవంబరు 2020 (17:09 IST)
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా రాగుళ్ళ వాగులో వరద ఉదృతి లో చిక్కుకున్న ఇద్దరు రైతులను రెస్క్యూ సిబ్బంది కాపాడారు.  రెస్క్యూ సిబ్బందితో కలిసి ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహాయ చర్యల్లో పాల్గొన్నారు. 
 
గురువారం ఉదయం పొలం పనులకు వెళ్లిన ముగ్గురు రైతులు వరద ఉధృతి లో చిక్కుకున్నారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి  రాగుళ్ళ వాగు వద్దకు చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు.

మొదట  రైతులను కాపాడేందుకు హెలికాప్టర్లను తెప్పించారు. కాగా, వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ల సహాయక చర్యలు ముందుకు సాగలేదు. వెను వెంటనే స్పీడ్ మోటార్ బోట్ లను తెప్పించి రైతులను కాపాడారు.  ఇద్దరు రైతులను కాపాడగలిగారు. మరో రైతు వరద ఉధృతి లో గల్లంతయ్యాడు. గల్లైంతైన రైతును కాపాడే  చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments