Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైతులతో గుంజీలు తీయించిన తహసీల్దార్.. ఎందుకో తెలుసా?

రైతులతో గుంజీలు తీయించిన తహసీల్దార్.. ఎందుకో తెలుసా?
, సోమవారం, 9 నవంబరు 2020 (21:56 IST)
ఒరిస్సా రాష్ట్రం అనుగుల్‌ జిల్లా కిశోర్‌నగర్‌ ప్రాంతం పండురియా గ్రామానికి చెందిన రైతులు మగుణిసాహు, సుసాంత్‌ రాణాలు పొలానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగొస్తున్నారు.

మార్గమధ్యంలో కాలేజీ చౌక్‌ వద్ద పోలీసులతో కలసి తనిఖీలు చేస్తున్న తహసీల్దారు లక్ష్మీప్రసాద్‌ సాహు వీరిని అడ్డుకున్నారు. మాస్కులు సరిగా ధరించలేదంటూ దుర్భాషలాడి, రూ.500 అపరాధరుసుం చెల్లించాలన్నారు. 
 
పొలం పనుల నుంచి వస్తున్న తమ వద్ద డబ్బులు లేవన్న రైతులతో గుంజీలు తీయించారు. సమీపంలో ఓ ఇంటికి అమర్చిన సీసీటీవీ కెమెరాకు ఈ దృశ్యాలు చిక్కడంతో ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీనిపై తహసీల్దార్‌ను మీడియా ప్రశ్నించగా తాను కేవలం మందలించానని, వారే క్షమించమని గుంజీలు తీశారని చెప్పారు.

ఈ ఘటనపై అనుగుల్‌కలెక్టర్‌ సిద్ధార్థ్‌ శంకర్‌ స్వయ్‌ స్పందిస్తూ దర్యాప్తు చేయాలని ఆటమల్లిక్‌ ఉప కలెక్టర్‌కు ఆదేశించారు. మరోవైపు రైతులు స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగార్జునసాగర్​లో జల విహారానికి లాంచీలు సిద్ధం