Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశంలో ముసలం.. బొజ్జల రాజీనామాతో షాక్.. చిత్తూరులోనే తిరుగుబాటు

రాష్ట్ర మంత్రివర్గ పునర్యవ్యస్థీకరణలో భాగంగా పదవిని పోగొట్టుకున్న సీనియర్ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీకి, అధినేత చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. తనను మంత్రి పదవినుంచి తప్పించడంపై తీవ్ర

Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (09:42 IST)
రాష్ట్ర మంత్రివర్గ పునర్యవ్యస్థీకరణలో భాగంగా పదవిని పోగొట్టుకున్న సీనియర్ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీకి, అధినేత చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. తనను మంత్రి పదవినుంచి తప్పించడంపై తీవ్ర అసంతృప్త వ్యక్తంచేసిన బొజ్జల ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చంద్రబాబుకు ఊహించని షాక్ ఇచ్చారు. అంతేకాకుండా ఏ మాత్రం జాగు చేయకుండా తన రాజీనామా లేఖను స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు, ముఖ్యమంత్రికి పంపించారు. 
 
పార్టీలో సీనియర్‌గా ఉన్న తనను మంత్రివర్గం నుంచి తొలగించడం ఏమిటంటూ బొజ్జల తన సన్నిహితుల వద్ద వాపోయారు. పైగా చంద్రబాబుతో చిరకాల స్నేహం సాగించిన బొజ్జలను బయటకు సాగనంపడం ద్వారా అవసరం తీరాక బయటకు తోలేస్తారన్ని అపప్రధను చంద్రబాబు మరోసారి మూటకట్టుకున్నట్లు అయింది. 
 
అలిపిరి బాంబుదాడిలో నక్సలైట్ల మందుపాతర నుంచి తృటిలో చంద్రబాబు తప్పించుకున్నప్పుడు కారులో ఆయన పక్కనే కూర్చున్నంత సాన్నిహిత్యం బొజ్జలది. అలాంటి తానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం సంచలనం కలిగిస్తోంది. మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణపై బొజ్జలతో పాటు పలువురు ఆశావహులు కూడా అసంతృప్తితో ఉన్నారు. కడప జిల్లా నుంచి ఆదినారాయణ రెడ్డికి కేబినెట్‌లో చోటు దక్కింది. దీంతో రామసుబ్బారెడ్డి వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. 
 
అన్ని జిల్లాల్లో మంత్రి పదవుల పందారం తర్వాత చాన్సు మిస్సయిన వర్గాలు, వ్యక్తుతు పార్టీ అధినాయకత్వంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వీరిని సమాధానపర్చడం నాయకత్వానికి తలప్రాణం తోకకు వస్తోంది. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments