Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీకి సర్వం సిద్దం: మంత్రి పెద్దిరెడ్డి

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (20:57 IST)
రాష్ట్రవ్యాప్తంగా వైస్ఆర్ పెన్షన్ కానుకను మే నెల ఒకటోతేదీన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఒకవైపు కరోనా నిబంధనలను పాటిస్తూనే, మరోవైపు లక్షలాధి మంది పెన్షనర్ల చేతికే ఒకటో తేదీన పెన్షన్ సొమ్మును అందించేందుకు ప్రభుత్వం సర్వం సిద్దం చేసిందని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 2,37,615 మంది వాలంటీర్లతో పెన్షన్ సొమ్మును పంపిణీ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

కోవిడ్ – 19 నియంత్రణ చర్యల్లో భాగంగా పెన్షనర్ల బయో మెట్రిక్ కు బదులుగా ప్రత్యేకంగా ప్రభుత్వం రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా జియోట్యాగింగ్ తో కూడిన ఫోటోలను యాప్‌ లో అప్ లోడ్ చేస్తారని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే మొత్తం వాలంటీర్లకు ప్రభుత్వం అందచేసిన ఫోన్ లలో అధికారులు ఈ ప్రత్యేక యాప్ ను డౌన్ లోడ్ చేయించారని అన్నారు.

మే నెలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ప్రభుత్వం 1421.20 కోట్ల రూపాయలను విడుదల చేసిందని, ఇప్పటికే ఈ మొత్తంను పేదరిక నిర్మూలనాసంస్థ (సెర్ఫ్) ద్వారా రాష్ట్రంలోని వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని అన్నారు.

సచివాలయ కార్యదర్శుల నుంచి సొమ్మును వాలంటీర్లకు అందచేయడం ద్వారా, శుక్రవారం (మే 1వ తేదీ) ఉదయం నుంచే నేరుగా పెన్షనర్ల చేతికి పింఛన్ సొమ్ము అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.

పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి అధికారుల నుంచి గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల వరకు భాగస్వాములు అవుతున్నారని, లాక్ డౌన్ నిబంధనల కారణంగా ఎక్కడైనా పెన్షనర్లు ఇతర ప్రాంతాల్లో వుండిపోయినట్లయితే, వారిని కూడా గుర్తించి, పోర్టబిలిటీ ద్వారా పెన్షన్ సొమ్మును అందించేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు.

వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులతో పాటు గుర్తింపు పొందిన వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా నెల ఒకటో తేదీనే పెన్షన్ సొమ్ము అందించాలన్న ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న హెచ్ఐవి, డయాలసిస్ పెషంట్లకు డిబిటి విధానంలో పెన్షన్ సొమ్మును జమ చేస్తున్నామని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments