ఏడాదిన్నర బాబుకూ కరోనా వైరస్‌.. ఒకే రోజు రంగారెడ్డిలో..?

Webdunia
శనివారం, 9 మే 2020 (11:52 IST)
రంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్ పంజా విసిరింది. శుక్రవారం ఒక్కరోజే ఐదుగురికి పాజిటివ్ సోకింది. ఈ కేసులన్నీ వనస్థలిపురం హుడాసాయికి కాలనీకి చెందినవేనని అధికారులు తెలిపారు. ఈ ఐదుగురిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. వీరిలో భార్యాభర్తలతోపాటు 11 ఏళ్ల కూతురు, 8 ఏళ్ల కుమారుడు ఉన్నారు. 
 
ఇప్పటికే పాజిటివ్‌గా వచ్చిన ఓ వ్యక్తి ఇంట్లో ఈ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఈ ఇంట్లోనే పనిచేస్తున్న ఓ మహిళకు చెందిన ఏడాదిన్నర బాబుకూ వైరస్‌ వ్యాప్తి చెందింది. వీరందరినీ నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
వరుసగా కేసులు నమోదవుతుండటంతో వనస్థలిపురం వాసులు భయం గుప్పిట్లో మగ్గుతున్నారు. యాక్టివ్‌ కేసులు తాజా కేసులతో కలుపుకుంటే జిల్లాలో కోరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 94కు చేరుకుంది. వీరిలో నలుగురు మృతి చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరోమారు సందడి చేయనున్న పుష్ప రాజ్ - శ్రీవల్లి జోడీ

మొన్ననే గోవాలో కలిశాను... ఆప్యాయంగా మాట్లాడారు : భాగ్యరాజ్ మృతిపై చిరంజీవి

తమిళ దిగ్గజ నటుడు కె.భాగ్యరాజ్య ఎలా చనిపోయారంటే...?

ఖుష్బూ సుందర్ కుమార్తె పెళ్లికి వెళ్లొచ్చారు.. గుండెపోటుతో భాగ్యరాజ్ కన్నుమూత (video)

కోలీవుడ్ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ హఠన్మరణం, మార్నింగ్ వాక్ చేసి వచ్చాక...

తర్వాతి కథనం
Show comments