Webdunia - Bharat's app for daily news and videos

Install App

న‌వ‌దీప్ ఎఫ్-క్ల‌బ్ ప‌బ్ ఖాతాకు ర‌కుల్ న‌గ‌దు బ‌దిలీ ఎందుకు చేసింది?

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (09:47 IST)
హైదరాబాద్లో నటుడు నవదీప్ న‌డుపుతున్న ఎఫ్‌-క్లబ్‌ పబ్‌ ఖాతాకు ప్రముఖ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) గుర్తించింది. అస‌లీ మొత్తం ఎందుకు బ‌దిలీ చేయాల్సి వ‌చ్చింద‌నేది ఇపుడు పెద్ద ప్ర‌శ్న‌. ఆ ప‌బ్ లో మాద‌క ద్ర‌వ్యాల వినియోగం, అమ్మ‌కాలు జ‌రిగేవ‌ని పోలీసులు గుర్తించారు. దీనిపై అప్ప‌ట్లో పెద్ద సంచ‌ల‌న‌మే రేకెత్తింది. న‌వ‌దీప్ ప‌బ్ పై పోలీసులు దాడి చేశారు కూడా. ఇపుడు ర‌కుల్ ప్రీత్ సింగ్ ను ఇ.డి. ఇదే విష‌య‌మై ప్ర‌శ్నించిన‌ట్లు తెలుస్తోంది. 
 
టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక నిందితుడైన కెల్విన్‌తో వాట్సాప్‌ చాటింగ్‌లో ఆమె ఆర్థిక లావాదేవీలపైనా చర్చించినట్లు ఇ.డి. ఆధారాలను సంపాదించింది. ఈడీ విచారణలో అధికారులు రకుల్‌ప్రీత్‌ సింగ్‌ను ప్రధానంగా నగదు బదిలీ, క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌, కెల్విన్‌తో ఆర్థిక లావాదేవీపై వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు. ఏడు గంటలు పాటు సుదీర్ఘంగా విచారణ చేశారు. రియా చక్రవర్తితో హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ మధ్య ఉన్న స్నేహ బంధంపైనా ప్ర‌శ్నించిన‌ట్లు స‌మాచారం. 
 
ర‌కుల్ ఇచ్చిన స‌మాధానాల‌పై త‌ర్వాత ఈ నెల 13న న‌వ‌దీప్, క్లబ్ మేనేజర్ విచారణతో ఈడీ అధికారులు ఒక నిర్ణ‌యానికి రానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments