Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆజాదీకా అమృత్ మహోత్సవ్... ధర్మవరంలో సీఆర్పీఎఫ్ సైకిల్ యాత్ర

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (09:27 IST)
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సీఆర్పీఎఫ్ ద‌ళాలు సైకిల్ యాత్ర చేస్తున్నాయి. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను గుర్తు చేసుకుని దేశ ఐక్యతకు అందరూ పాటుపడదామని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మ‌న‌కు స్వాతంత్రం సిద్ధించి 75 సంవ‌త్స‌రాలు పూర్తి అయిన సందర్భంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరున దేశ వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కన్యాకమారి నుంచి న్యూఢిల్లీ వరకు సీఆర్పీఎఫ్ వారు సైకిల్ యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సైకిల్ యాత్ర  ఈ రోజు ధర్మవరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్శి సెల్వరాజన్, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి పాల్గొని  ప్రసంగించారు.

భావి భార‌త దేశం కోసం యువ‌త ముంద‌డుగు వేయాల‌ని, స్వాత్రంత ఫ‌లాల‌ను అంద‌రికీ అందేలా త‌మ మేథాశ‌క్తితో కృషి చేయాల‌ని కోరారు.ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ కమాండెంట్ విద్యాధర్, అసిస్టెంట్ కమాండెంట్ కులదీప్, ధర్మవరం అర్బన్ సి.ఐ కరుణాకర్ , తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments