Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్షాబంధన్ : తమ్ముడి మృతదేహానికి రాఖీ కట్టిన చెల్లెలు...

రక్షా బంధన్ ఓ ఇంట అంతులేని శోకాన్ని మిగిల్చింది. రాఖీ పండుగ రోజున జరిగిన రోడ్డు ప్రమాదంలో తన సోదరుడు కన్నుమూశాడు. దీంతో తీవ్ర విషాదంలోనూ అన్న మృతదేహానికి చెల్లెలు రాఖీ కట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చ

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2017 (10:29 IST)
రక్షా బంధన్ ఓ ఇంట అంతులేని శోకాన్ని మిగిల్చింది. రాఖీ పండుగ రోజున జరిగిన రోడ్డు ప్రమాదంలో తన సోదరుడు కన్నుమూశాడు. దీంతో తీవ్ర విషాదంలోనూ అన్న మృతదేహానికి చెల్లెలు రాఖీ కట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయ విదారక ఘటన వివరాలను పరిశీలిస్తే...
 
కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన కొక్కొండ వినోద్‌ (22) అనే యువకుడు తన మిత్రులు కొందరితో కలిసి స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకునేందుకు ఆదివారం సాయంత్రం సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు వద్దకు కారులో వచ్చారు. అయితే, చెరువు గట్టుపై కారు వెళుతుండగా, అదుపుతప్పిన కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వినోద్ చనిపోయాడు. అతని మృతదేహం కోసం జాలర్లు గాలించి సోమవారం వెలికితీశారు. 
 
అతడి శవాన్ని చూడడంతోనే తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల శోకం మిన్నంటింది. రాఖీ పండగ కావడంతో అతని సోదరి శిరీష తీరని దుఃఖంతో విలపిస్తూనే వినోద్‌ మృతదేహానికి రాఖీ కట్టడం అక్కడున్న కంటతడిపెట్టించింది. వినోద్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments