Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం వద్దకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ మార్గాని భ‌రత్ పంచాయ‌తీ

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (10:50 IST)
స్వ‌ప‌క్షంలో విప‌క్షంలా నిత్యం మాట‌ల తూటాల‌తో మంట‌లు రేపుతున్న వైసీపీ నేత‌లు జక్కంపూడి రాజా, మార్గాని భరత్ ల పంచాయ‌తీ నేడు వైసీపీ అధినేత‌, సీఎం వై.ఎస్.జ‌గ‌న్ ఎదుటికి రానుంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం లోక్‌సభ సభ్యుడు మార్గాని భరత్‌ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలోనే వారు ఒకరిపై మరొకరు నువ్వెంత అంటే నువ్వెంత అనే రీతిలో వాగ్వివాదానికి దిగడంతో అధిష్ఠానం ఈ అంశంపై దృష్టి సారించింది. ఒక వైపు జడ్పీటీసీ, ఎంపీటీసీ అధ్యక్ష పదవుల ఎంపికపై జిల్లాల్లో వినిపిస్తున్న ధిక్కార స్వరాలు,  మంత్రులూ, ఎమ్మెల్యేలను లెక్క చేయకుండా ప్రతిపక్షం కూడా చేయనంతగా ఏకంగా టెంట్లు కట్టి మరీ వైసీపీ క్షేత్రస్థాయి నాయకులు తిరుగుబాటు చేయడం పార్టీ పెద్దలను కలవరానికి గురి చేస్తోంది. పైకి, పోటీ ఎక్కువగా ఉన్నప్పుడు పదవుల కోసం ఇలాంటి ఆందోళనలు తప్పవంటూ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తేలిగ్గా తీసుకున్నట్లుగా చెప్పినప్పటికీ, ఈ నిరసన కార్యక్రమాలను నిర్వహించడం పార్టీకి త‌ల‌వంపుగా వైసీపీ అధిష్ఠానం భావిస్తోంది.

దీనిపై వైసీపీ అధినేత‌, సీఎం వై.ఎస్.జ‌గ‌న్ సీరియ‌స్ అయిన‌ట్లు తెలుస్తోంది. అందుకు వారిద్ద‌రినీ వెంట‌నే తాడేప‌ల్లి సీఎం క్యాంపు కార్యాల‌యానికి పిలిపించిన‌ట్లు తెలుస్తోంది. సీఎం వీరిలో ఎవ‌రికి అక్షంత‌లు వేస్తార‌నేది, ఈ స‌మ‌స్య‌ను ఎలా కొలిక్కి తెస్తార‌నేది రాజ‌కీయ వ‌ర్గాల‌లో ఆస‌క్తిగా మారింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments