Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. మందుబాబులు చుక్కేయట్లేదు.. అమ్మకాలు తగ్గాయోచ్..

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వారం రోజుల పాటు కురుస్తున్న భారీ వర్షాలకు ఇంటి నుంచి బయటకు అడుగేసేందుకు ప్రజలు జడుసుకుంటున్నారు. దీంతో మందుబాబులు కూడా ఇంటికే పరిమితమైపోతున్

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (11:38 IST)
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వారం రోజుల పాటు కురుస్తున్న భారీ వర్షాలకు ఇంటి నుంచి బయటకు అడుగేసేందుకు ప్రజలు జడుసుకుంటున్నారు. దీంతో మందుబాబులు కూడా ఇంటికే పరిమితమైపోతున్నారు. భారీ వర్షాలతో మందుబాబులు చుక్కేసేందుకు కాలు బయటపెట్టట్లేదు. మద్యం అమ్మకాలతో భారీగా రెవెన్యూ తెచ్చిపెట్టే హైదరాబాద్ వర్షం దెబ్బకు అతలాకుతలమైంది. 
 
మద్యం ప్రియుల కొనుగోలు తగ్గిపోవడంతో పాటున మద్యం సరఫరా చేయడానికి కూడా రవాణా సౌకర్యం లేక రెవెన్యూ పడిపోయిందని తెలంగాణ వైన్ డీలర్ అసోషియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాగా, 2016-17 సంత్సరానికిగానూ మద్యం అమ్మకాల ద్వారా రూ.4318కోట్ల రెవెన్యూ లక్ష్యంగా నిర్దేశించుకోగా ఆగస్టు వరకు రూ. 2,044కోట్ల మేర రెవెన్యూ సమకూరింది. అయితే ఈ యేడాది ఆగస్టు పండగ సీజన్‌లో 20శాతం మేర అమ్మకాలు పెరిగినట్లు అధికారులు తెలిపారు.
 
మద్యం అమ్మకాల ద్వారా సెప్టెంబర్ రూ.637.96కోట్ల రెవెన్యూ ప్రభుత్వానికి రావాల్సి ఉండగా ఈనెల 22న వరకు కేవలం రూ.287.7కోట్ల ఆదాయమే సమకూరింది. దీంతో ఈనెలలో దాదాపు 55శాతం మేర నష్టంవాటిల్లింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments