Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే రెండు రోజులు తెలంగాణాలో తేలికపాటి వర్షాలు

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (10:15 IST)
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు ఆగ్నేయ దిశల నుంచి గాలులు తెలంగాణ వైపు వీస్తున్నట్టు పేర్కొంది. కాగా, గత 24 గంటల్లో వ్యాప్తంగా సగటున 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, నల్గొండ జిల్లా దామరచర్లలో అత్యధికంగా 27.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. అదేవిధంగా మెదక్‌లో పగటి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా 17 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 17.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమైందని పేర్కొంది. 
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : బర్రెలక్క మేనిఫెస్టో ఎలా ఉందో చూశారా? 
 
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇలాంటి వారిలో బర్రెలక్క అలియాస్ శిరీష్ ఒకరు. ఆమె కొల్లాపూర్ అసెంబ్లీ స్థా నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ తన కాళ్లపై తాను నిలబడేందుకు వీలుగా బర్రెలు మేపుకుంటూ తన తల్లిని పోషించుకుంటున్నారు. పైగా ఈ ఎన్నికల్లో ఆమె నిరుద్యోగుల కోసం పోటీ చేయాలని నిర్ణయించిన రంగంలోకి దిగారు. దీంతో ఆమెకు అనేక మంది నిరుద్యోగులు సంపూర్ణ మద్దతు తెలుపుతూ సొంతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. 
 
తనను గెలిపించి అసెంబ్లీకి పంపితే నిరుద్యోగుల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని, ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తానని మేనిఫెస్టోలో ప్రకటించారు. పేదల ఇళ్ళ నిర్మాణానికి కృషి చేయడంతో పాటు నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇప్పిస్తానని, ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఉచిత వైద్యం, విద్య, నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు, ఉచిత శిక్షణ, ఉన్నత చదువుల కోసం కోచింగ్ ఉచితంగా ఇప్పించేందుకు ప్రయత్నిస్తాని శిరీష తన మేనిఫెస్టోలో పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments