Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ శుభవార్త... ఏంటది?

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (10:50 IST)
తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. శంషాబాద్ - విజయవాడ - విశాఖపట్టణం, కర్నూలు -విజయవాడ మధ్య సూపర్ ఫాస్ట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ దిశగా కేంద్ర రైల్వేశాఖ కసరత్తులు చేపట్టింది. ఇందులోభాగంగా, ఈ రెండు మార్గాల్లో ప్రాథమిక ఇంజనీరింగ్ మరియు ట్రాక్ (పెట్) సర్వేకు ఆదేశించింది. సర్వే అనంతరం రైల్వే ప్రాజెక్టులపై తుది నిర్ణయం తీసుకుంటారు. 
 
శంషాబాద్ - విజయవాడ ప్రాంతాల మధ్య రైలు అందుబాటులోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గుతుందని, కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు వివరించారు. దీంతో కేంద్ర రైల్వే శాఖ ఈ మార్గంలో పెట్ సర్వేకు అనుమతులు మంజూరు చేసింది. 
 
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు గంటకు 110 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తున్నాయి. అయితే, ఇపుడు ప్రతిపాదించిన రెండు సూపర్ ఫాస్ట్ రైలు మార్గాలు మాత్రం అందుబాటులోకి వస్తే ఈ మార్గాల్లో ఏకంగా 220 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపాలని కేంద్ర రైల్వే శాఖ భావిస్తుంది. 
 
ఈ క్రమంలోనేనే రూట్‌ను నిర్ణయించేందుకు పెట్ సర్వే కోసం ఓ కాంట్రాక్టర్‌ను కూడా ఎంపిక చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో వందే భారత్ రైళ్లను నడిపే విషయాన్ని కూడా భారతీయ రైల్వే సిద్ధమవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం