Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోకిరీల చెర నుంచి యువతిని రక్షించిన రైల్వే మంత్రి

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (14:34 IST)
రైలులో భోపాల్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న యువతిని రైల్వే మంత్రి ఆదుకున్నారు. ఇబ్బందులలో ఉన్న యువతి సోదరుడి ట్వీట్ మేరకు మంత్రి గారు వెంటనే చర్య తీసుకున్నారు. పోలీసులను పంపి ఆమెను కాపాడారు. విశాఖపట్టణం నుంచి న్యూఢిల్లీ వెళుతున్న ట్రైన్ నంబర్ 22415 సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ యువతి భోపాల్ నుండి న్యూఢిల్లీ వెళ్తోంది. 
 
ఇంతలో కొందరు ఆకతాయిలు మద్యం సేవించి ఆమె ఉన్న బోగీలోకి ప్రవేశించారు. మహిళను అల్లరి చేయడం మొదలు పెట్టారు. బాధితురాలి సోదరుడు నిస్సహాయ స్థితిలో రైల్వే మంత్రికి ట్వీట్ చేసాడు. నా చెల్లిని కాపాడండి, నేను ఏమీ చేయలేని పరిస్థితులలో ఉన్నాను, కొందరు పోకిరీలు వచ్చి నా చెల్లిని అల్లరి పెడుతున్నారు. ఆమె ట్రైన్ నంబర్ 22415లో ఉంది. నేనిప్పుడు రాంచీలో ఉన్నాను అని అభ్యర్థించాడు. 
 
ఈ సందేశాన్ని స్వీకరించిన వెంటనే రైల్వే మంత్రి ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆ మహిళను వెంటనే రక్షించమని ఆగ్రా పోలీసులను ఆదేశించారు. ఆ తర్వాత మంత్రి బాధితురాలి సోదరుడికి తిరిగి ట్వీట్ చేసి మీరు నిశ్చింతగా ఉండండి, మేము చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పారు. కాసేపటికి పోలీసులు బోగీలోకి ఎక్కి పోకిరీలను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఆమె సోదరుడికి తెలియజేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?

ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత

మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్ లో శ్రీలంకలో షూటింగ్ ప్రారంభం

రామ్ చరణ్, బాలయ్య సినిమాలతోపాటు మేమూ సంక్రాంతికి వస్తున్నాం : వెంకటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments