Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్‌ఐటీలో ర్యాగింగ్‌.. జూనియర్‌ను చితకబాదిన సీనియర్లు

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2022 (14:21 IST)
Ragging
తాడేపల్లిగూడెం ఎన్‌ఐటీలో ర్యాగింగ్‌ కలకలం రేగింది.  సీనియర్లు తొమ్మిది మంది కలిసి.. ఒక విద్యార్థిని చావబాదారు. ఫోన్‌ చేసి పిలిచి.. హాస్టల్‌ గదిలో దాడి చేశారు. చేతికి దొరికిన వస్తువులతో చితక్కొట్టారు. ఈ వివాదం ముందే డైరెక్టర్‌ దాకా వెళ్లినా.. పట్టించుకోకపోవడంతో దాడి వరకు వెళ్లింది.
 
వివరాల్లోకి వెళితే.. బీటెక్‌ మెకానికల్‌ సెకండియర్‌ చదువుతున్న జయకిరణ్‌కి.. సీనియర్లకు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే జయకుమార్‌ను ఫ్రెండ్‌ రూమ్‌కి పిలిపించిన సీనియర్లు.. రాత్రి పది గంటల నుంచి ఉదయం పది గంటల వరకు మోకాళ్లపై కూర్చోబెట్టారు. హాస్టల్‌ గదిలో చేతికి అందిన జగ్గు, వాటర్‌ బాటిళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. కర్రలు, బెల్టులతో చావబాదారు.
 
తీవ్రగాయాలపాలైన జయకిరణ్‌.. వారు విడిచిపెట్టిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments