Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘురామ రాజును అలా ఇబ్బంది పెడుతున్న ఏపీ సీఐడీ .. లీగల్ నోటీసులు

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (13:15 IST)
రాజద్రోహం కేసులో అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసిన వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, గత నెల 14వ తేదీన ఆయన్ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అదే రోజున ఆయన ఐఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇపుడు ఆ ఫోన్ నుంచి అనేక మందికి మెసేజ్‌లు పంపుతున్నారు. ఈ సందేశాలను రిసీవ్ చేసుకున్నారిలో మాజీ విశ్రాంత ఐఏఎస్ అధికారి, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్ ఉన్నారు. 
 
తనతో పాటు తన కుటుంబ స‌భ్యుల‌కు ఓ మొబైల్ నంబ‌రు నుంచి మెసేజ్‌లు వ‌స్తున్నాయ‌ని, ఆ నంబ‌రు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుద‌ని తెలిసింద‌ని పీవీ ర‌మేశ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ట్విట్టర్ ఖాతాలోనే స్పందించారు.
 
'ఏపీ సీఐడీ పోలీసులు మే 14న న‌న్ను అరెస్టు చేసిన రోజున నా మొబైల్ ఫోనును అన‌ధికారికంగా స్వాధీనం చేసుకున్నారు. ఇప్ప‌టికీ అది వారి వద్దే ఉంది. దాన్ని తిరిగి ఇచ్చేయాలని నిన్న లీగ‌ల్ నోటీసులు పంపాను. నాలుగు రోజుల క్రితం అందులోని సిమ్ కార్డును బ్లాక్ చేయించాను.. కొత్త సిమ్ కార్డు తీసుకున్నాను' అని ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వివ‌రించారు.
 
'మే 14 నుంచి జూన్ 1 వ‌ర‌కు నేను ఎవ్వ‌రికీ, ఎటువంటి మెసేజ్‌లూ పంప‌లేదు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నా మొబైల్‌ను దుర్వినియోగం చేస్తే కనుక, సునీల్ కుమార్‌తో పాటు ఇత‌రుల‌పై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకునేలా చేస్తాన‌ని హామీ ఇస్తున్నాను' అని ర‌ఘురామ చెప్పారు. దీనిపై స్పందించిన పీవీ ర‌మేశ్ స్ప‌ష్ట‌త ఇచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు అంటూ మ‌రో ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments