Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోనాల్డ్ ట్రంప్‌కు షాక్.. ఫేస్‌బుక్ ఖాతాపై రెండేళ్ళ నిషేధం

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (12:35 IST)
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఫేస్‌బుక్ తేరుకోలేని షాకిచ్చింది. అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి కేసులో ట్రంప్ ఖాతాపై ఫేస్‌బుక్‌ రెండేళ్ల పాటు నిషేధం విధించింది. 
 
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ఏడాది జనవరి 6న క్యాపిటల్‌ హిల్స్‌లో అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ గెలుపును చట్టసభ్యులు ధ్రువీకరిస్తున్న నేపథ్యంలో ట్రంప్‌ ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్‌ మీడియాలో చేసిన పోస్టులు అల్లర్లకు దారి తీశాయని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. 
 
ఈ మేరకు పోస్టులను తొలగించడంతో పాటు బ్యాన్‌ విధించిన విషయం తెలిసిందే. జనవరి 6న ఫేస్​బుక్​ ద్వారా ట్రంప్​ చేసిన పోస్టులు సంస్థ నియమాలను ఉల్లంఘించాయని, కంపెనీ వరల్డ్‌ వ్యవహారాల ఉపాధ్యక్షుడు నిక్‌ క్లెగ్ పేర్కొన్నారు. 
 
దీంతో రెండేళ్ల పాటు ట్రంప్‌ ఖాతాను సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత మరోసారి నిర్ణయంపై మరోసారి సమీక్ష జరుపుతామని పేర్కొన్నారు. తాజాగా సమీక్ష జరిపిన ఎఫ్.బి. ఆయన ఖాతాను కనీసం 2023 వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు ఈ సోషల్ మీడియా దిగ్గజం పేర్కొంది.
 
‘ఆయన చర్యలు మా నియమాలను తీవ్రంగా ఉల్లంఘించినట్లే కొత్తగా వచ్చిన ప్రోటోకాల్స్ ప్రకారం విధించగలిగిన అత్యంత కఠినమైన శిక్ష ఆయనకు వేయాలి’ అని ఫేస్‌బుక్‌ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments