Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రాజమండ్రికి పవన్ కళ్యాణ్ - చంద్రబాబు ములాఖత్

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2023 (08:21 IST)
జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో, చంద్రబాబును కలిసేందుకు పవన్ కల్యాణ్ జైలు అధికారులకు ములాఖత్ దరఖాస్తు చేసుకోగా, వారికి జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వెంట హీరో బాలకృష్ణ, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌లు కూడా రాజమండ్రి జైలుకు వెళ్లనున్నారు. 
 
దీనిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. గురువారం రాజమండ్రి కేంద్ర కారాగారంలో చంద్రబాబును పవన్ కల్యాణ్ కలుస్తుండడం సంతోషదాయకమన్నారు. ఏపీ రాజకీయాల్లో ఇది కీలక మలుపు అని రఘురామ అభివర్ణించారు. ఆపదలో అండగా నిలిచేవాడే స్నేహితుడు అని ఉద్ఘాటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments