Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో ఏకాంతంగా ఆర్ఆర్ఆర్ చర్చలు!

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (08:47 IST)
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు బుధవారం రాత్రి అర్థగంటపాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఆ సమయంలో తనపై ఏపీ సీఐడీ పోలీసులు, గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, గుంటూరు ప్రభుత్వ జీహెచ్ సూపరింటెండెంట్, సైనిక ఆస్పత్రి డైరెక్టర్ నడుచుకున్న తీరును పూసగుచ్చినట్టు వివరించారు. అంతేకాకుండా, తనపై రాజద్రోహం కింద కేసు నమోదు చేయడానికి గల కారణాలను ఆయన స్పీకర్ ఓం బిర్లాకు వివరించారు. 
 
ఏపీ సీఎం, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ తాను సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని జీర్ణించుకోలేక కక్షతోనే తనపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని స్పీకర్‌కు వివరించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. 
 
తన కేసులో ముఖ్యమంత్రి జగన్, డీజీపీ, సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్, ఏఎస్‌పీ విజయ్‌పాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. తనపై రాజద్రోహం కేసు పెట్టి చిత్రహింసలకు గురిచేశారని, తనను తీవ్రంగా గాయపరిచారని స్పీకర్‌కు తెలిపారు. 
 
తాను సీఐడీ కస్టడీలో ఉన్న సమయంలో ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తులు తనను తీవ్రంగా కొట్టారన్నారు. పార్లమెంటు సభ్యుడిగా తన హక్కులకు భంగం కలిగించారని, తన అరెస్టుకు ముందు స్పీకర్‌గా మీకు సమాచారం కూడా ఇవ్వలేదని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు.
 
తనను అక్రమంగా అరెస్ట్ చేసిన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు అయిన గాయాలపై గుంటూరు ప్రభుత్వ వైద్యుల బృందం ఇచ్చిన అసత్యాల నివేదికపై హైకోర్టు ఆదేశాలను సీఐడీ పోలీసులు, సీఐడీ కోర్టు బేఖాతరు చేశాయన్నారు. 
 
వారికి కోర్టు ధిక్కారణ నోటీసులు కూడా జారీ అయినట్టు గుర్తు చేశారు. రఘురామ కృష్ణరాజు చెప్పినవన్నీ విన్న స్పీకర్ ఓం బిర్లా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తనపై జరిగిన దాడిపై మాట్లాడేందుకు అనుమతివ్వాలని కోరగా, స్పీకర్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments