ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలి : వైకాపా ఎంపీ

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (15:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని ఆ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌తో పాటు పలు పత్రాలను కోర్టుకు ఆయన సమర్పించారు. 
 
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ 11 ఛార్జ్ షీట్లను నమోదు చేసిందని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. అన్ని ఛార్జిషీట్లలో ఆయన ఏ-1గా ఉన్నారని తెలిపారు. జగన్ కేసుల విచారణను త్వరగా పూర్తి చేయాలని కోరారు. 
 
రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా, తమ పార్టీకి చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతోనే తాను పిటిషన్ వేసినట్టు ఆయన తెలిపారు. అలాగే, షరతుల బెయిల్‌ పొందిన జగన్మోహన్... అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాక్షులను ప్రభావితం చేసేలా ఈ కేసుల్లోని నిందితులకు పలు పదవులు ఇచ్చారని కోర్టు దృష్టితీసుకెళ్లారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments