పులిచింతల ప్రాజెక్టులో కొట్టుకుపోయిన గేటు

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (12:00 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్రతిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న పులిచింత‌ల ప్రాజెక్ట్ కు మాయ‌ని మ‌చ్చ ఏర్ప‌డింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉండ‌గానే, మొన్న వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌కు కృష్ణ జిల్లా పులిచింతల ప్రాజెక్టులోని 16 నెంబ‌రు గేటు కొట్టుకొని పోయింది.

తెల్ల‌వారుజామున మూడున్న‌ర సమయంలో ఇన్ ప్లో అధికంగా ఉండటంతో కొంతమేర గేటు పైకి ఎత్తే క్రమంలో గాటర్స్‌లో మెకానికల్ తేడా వలన 16 నంబర్ గేటు ఊడి పోయిందని సమాచారం. ఈ మ‌ధ్యాహ్నానిక‌ల్లా గేటును రిపేరు చేసేందుకు అధికారులు తంటాలు ప‌డుతున్నారు. పులిచింత‌ల ప్రాజెక్టును ప్ర‌భుత్వం ఎంతో ఘ‌నంగా నిర్మిస్తోంది.

అయితే, ఇలాంటి సంఘ‌ట‌న‌లు నిర్మాణ నాణ్య‌త‌ను అనుమానించేలా ఉన్నాయ‌ని, దీనికి స‌త్వ‌రం ప‌రిష్కార మార్గం క‌నుగొనాల‌ని అధికారులు భావిస్తున్నారు. పులిచింత‌ల గేటు ఊడిపోవ‌డంపై నీటిపారుద‌ల శాఖ అధికారులెవ‌రూ మాట్లాడ‌టం లేదు. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాలంటే, రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల నుంచి అనుమ‌తి ల‌భించాల‌ని అధికారుల్లో ఒక‌రు అన్యాపదేశంగా మీడియాకు చెప్పారు. ఏది అన్నా త‌మ ఉద్యోగాల మీద‌కు వ‌స్తోంద‌ని పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments