Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో సైకో పాఠశాలకు వెళ్ళి బట్టలిప్పేశాడు.. ఆ తరువాత ఏం చేశాడు?

తిరుపతిలో ఒక సైకో హల్‌‌చల్‌ చేశాడు. ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌లో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలోకి వెళ్ళాడు. విద్యార్థులు చూస్తుండగానే ఒంటిపై ఉన్న బట్టలన్నింటినీ విప్పేశాడు. అంతటితో ఆగలేదు... అన్ని తరగతులను తిరిగాడు. సైకో చేష్టలను చూసిన విద్యార్థులు గట్టిగా కే

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (18:01 IST)
తిరుపతిలో ఒక సైకో హల్‌‌చల్‌ చేశాడు. ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌లో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలోకి వెళ్ళాడు. విద్యార్థులు చూస్తుండగానే ఒంటిపై ఉన్న బట్టలన్నింటినీ విప్పేశాడు. అంతటితో ఆగలేదు... అన్ని తరగతులను తిరిగాడు. సైకో చేష్టలను చూసిన విద్యార్థులు గట్టిగా కేకలు వేశారు. విద్యార్థులతో కలిసి సైకో అరవడం మొదలుపెట్టాడు. అన్ని తరగతులను చుట్టేశాడు. పాఠశాలలోని కొంతమంది అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా ఫలితం లేకుండా పోయింది. టీచర్లు ఉండే గది వద్దకు వెళ్లాడు. అక్కడ వారితో అసహ్యంగా ప్రవర్తించాడు.
 
దీంతో కొంతమంది మహిళా టీచర్లే అతడిని పట్టుకుని చెట్టుకు కట్టేశారు. ఆ తరువాత దేహశుద్ధి చేసి ఎం.ఆర్‌.పల్లి పోలీసులకు అప్పజెప్పారు. ఉన్నట్లుండి జరిగిన ఈ సంఘటనలో పాఠశాలలోని విద్యార్థులు భయబ్రాంతులకు గురయ్యారు. గత కొన్నిరోజుల నుంచి ఆ సైకో అదే ప్రాంతంలో తిరుగుతూ ఉండేవాడు. అయితే ఎవరికీ ఎలాంటి హాని చేయలేదని స్థానికులు చెబుతున్నారు. మొదటిసారి అతను ఈ విధంగా ప్రవర్తించాడని స్థానికులు చెబుతున్నారు. సైకో తిరుపతి కోటకొమ్మలవీధికి చెందిన సుబ్బయ్యగా పోలీసులు గుర్తించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments