విజయవంతంగా నింగిలోకి పీఎస్ఎల్‌వీ సి-49: ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన గవర్నర్

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (17:49 IST)
శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పీఎస్ఎల్‌వీ సి-49 రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి ప్రయాణించడం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ హర్షం వ్యక్తం చేశారు. పీఎస్‌ఎల్‌వీ సి-49 వాహకనౌక ద్వారా 10 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టటం ముదావహమన్న గవర్నర్, ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను అభినందించారు.
 
భారత్‌కు చెందిన ఉపగ్రహం ఈవోఎస్‌-01 వ్యవసాయం, ప్రకృతి వైపరీత్యాలపై అధ్యయనం చేయనుండగా, ప్రయోగం సఫలీకృతం చేసిన ప్రతి ఒక్క ఇస్రో శాస్త్రవేత్త అభినందనీయుడేనన్నారు.
 
శాస్త్రవేత్తలు పిఎస్ఎల్వి సి-49ను విజయవంతంగా ప్రయోగించడం దేశ అంతరిక్ష కార్యక్రమం పట్ల వారి అంకితభావానికి నిదర్శనమని గవర్నర్ శ్రీ హరిచందన్ అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని గవర్నర్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments