Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందమైన యువతులతో ఎర... ఎంజాయ్‌ చేస్తున్న సంపన్న వర్గాల పిల్లలు

తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదనకు (ఈజీ మని) అలవాటుపడిన కొందరు నిర్వాహకులు స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచార కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రాజకీయ పెద్దల అండదండలతోపాటు, స్థానిక పోలీసుల మద్దత

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (14:00 IST)
తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదనకు (ఈజీ మని) అలవాటుపడిన కొందరు నిర్వాహకులు స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచార కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రాజకీయ పెద్దల అండదండలతోపాటు, స్థానిక పోలీసుల మద్దతును తీసుకుంటున్నారు. నెల నెలా మామూళ్లకు అలవాటు పడిన కొందరు పోలీసులు అక్కడ ఏం జరిగినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తుంటారు. ఈజీ మనికి అలవాటు పడిన కొందరు కేటుగాళ్లు మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, రాయదుర్గం, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌ వంటి సంపన్న ప్రాంతాలను అడ్డాగా మార్చుకుంటున్నారు.
 
ఇందులోభాగంగా, బాడీ మసాజ్‌ పేరుతో ఏర్పాటు చేసిన స్పా, మసాజ్‌ సెంటర్లకు వచ్చే కస్టమర్లకు అందమైన యువతులతో నిర్వాహకులు ఎర వేస్తున్నారు. ముఖ్యంగా, థాయ్‌లాండ్‌, బంగ్లాదేశ్‌, ఉజ్బెకిస్థాన్‌, టాంజానియా, నార్త్‌ ఇండియా, హైదరాబాద్‌తోపాటు గుంటూరు, వైజాగ్‌ తదితర ప్రాంతాల నుంచి అందమైన యువతులను రప్పిస్తున్నారు.
 
ఆ తర్వాత ఖరీదైన స్పా సెంటర్లకు సంపన్న వర్గాలకు చెందిన వారి పిల్లలు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులతోపాటు రాజకీయ ప్రముఖుల పుత్ర రత్నాలు వెళ్లి ఎంజాయ్‌ చేస్తున్నారు. అనేకసార్లు పోలీసులు నిర్వహించిన దాడుల్లో బడాబాబుల పిల్లల వెకిలి మకిలీ బయటపడింది. అలాంటి వారి పుణ్యమాని ఆయా సెంటర్ల నిర్వాహకులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.
 
స్పా సెంటర్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న పార్లర్‌పై ఎస్‌ఓటీ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. చందానగర్‌లోని సన్‌షైన్‌ స్పా అండ్‌ బ్యూటీ కేర్‌లో వ్యభిచారం చేస్తున్న నలుగురు విటులను అరెస్టు చేశారు. నలుగురు యువతులను రెస్క్యూహోంకు తరలించారు. వారి నుంచి రూ.15 వేలు, 8 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను చందానగర్‌ పోలీసులకు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

తర్వాతి కథనం
Show comments