Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మాయిలతో సివిల్స్ ర్యాంకర్ - స్పా - మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం

సులభతరమైన మార్గంలో డబ్బు సంపాదనకు అలవాటుపడిన కొందరు అందమైన భవనాల్లో జోరుగా చీకటి వ్యాపారం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తూ విచ్చలవిడిగా డబ్బులు సంపాదిస్తున్

అమ్మాయిలతో సివిల్స్ ర్యాంకర్ - స్పా - మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం
, గురువారం, 21 జూన్ 2018 (08:39 IST)
సులభతరమైన మార్గంలో డబ్బు సంపాదనకు అలవాటుపడిన కొందరు అందమైన భవనాల్లో జోరుగా చీకటి వ్యాపారం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తూ విచ్చలవిడిగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలా అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ సివిల్స్ ర్యాంకర్‌ను పోలీసులు పట్టుకున్నారు. అతని హిస్టరీ తెలుసుకుని పోలీసులే అవాక్కయ్యారు. హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఉన్నత చదువుల కోసం సంతోష్ అనే యువకుడు వైజాగ్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చాడు. ఇతగాడు ఓ కోచింగ్ సెంటర్‌లో చేరి సివిల్స్ కోసం శిక్షణ పొందుతున్నాడు. ఈ సమయంలో ఓ స్పా సెంటర్ నిర్వాహకుడు పరిచమయ్యాడు. అతనికి మాయమాటలు చెప్పడంతో పాటు ఈజీ మనీ ఎలా సంపాదించవచ్చో ఆ నిర్వాహకుడు చెప్పాడు. దీంతో అత్యాశకు పోయిన సంతోష్... అతడితో చేతులు కలిపాడు. 
 
కొద్ది రోజులకే వారిమధ్య విభేదాలు రావడంతో అతనితో వేరుపడి సొంతంగా స్పా సెంటరును ప్రారంభించాడు. నగరంతోపాటు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల నుంచి అందమైన యువతులను తీసుకొచ్చి స్పా సెంటర్‌ నిర్వహించడం మొదలు పెట్టాడు. అప్పుడప్పుడు పోలీసులు దాడులు నిర్వహించగా అతడిపై రెండు కేసులు నమోదయ్యాయి. 
 
ఈ దందా కొనసాగిస్తూనే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాయగా, ఇందులో మంచి మార్కులతో ర్యాంక్ సంపాదించాడు. పైగా, మెయిన్స్‌, ఇంటర్వ్యూలోనూ అర్హత సాధించాడు. అయితే, అతడిపై రెండు కేసులు పెండింగ్‌లో ఉండడంతో యూపీఎస్సీ అధికారులు విత్‌హెల్డ్‌లో పెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ నగర పోలీసులు అతడు నారాయణగూడలో నిర్వహిస్తున్న స్పా సెంటర్‌లో సోదాలు చేశారు. ఇందులో క్రాస్ మసాజ్ జరుగుతున్న విషయాన్ని గుర్తించారు. దీంతో సంతోష్‌తో పాటు ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సంతోష్‌ సివిల్స్‌ ర్యాంకర్‌ అని తెలిసి అవాక్కయ్యారు. ఇలాంటి వ్యాపారం చేయడం వల్ల అతడి భవిష్యత్‌ అంధకారమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘సాక్షర భారత్ మిషన్’ కేంద్రం నిలిపివేసింది... 19 వేల మందికి గౌరవ వేతనం నిల్