Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లా సీతానగరం అత్యాచారం కేసులో పురోగతి

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (16:15 IST)
గుంటూరు జిల్లా సీతానగరం అత్యాచారం కేసులో పురోగతి సాధించారు పోలీసులు. గురువారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లాలో ఇద్దరు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితుడిని గుంటూరు అర్బన్‌ పరిధిలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో ఉంచి విచారిస్తున్నట్టు సమాచారం.
 
నిందితుడు కృష్ణానా? వెంకటరెడ్డా? అనేది తెలియాల్సి ఉంది. ఒంగోలులో తిష్టవేసిన పోలీసులు 30 రోజుల పాటు వివిధ వేషధారణలతో యాచకుల దగ్గర్నుంచి.. హిజ్రాలను, సమోసాలు అమ్ముకునే వారిని, రైల్వే ట్రాక్‌ల పక్కన చెత్త ఏరుకునే వారిని విచారిస్తూ ఎట్టకేలకు ఒంగోలు ఫ్లై ఓవర్‌ కింద సేదదీరుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
 
రెండో నిందితుడు కూడా ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్టు సమాచారం రావడంతో గుంటూరు అర్బన్‌ నుంచి వెళ్లిన పలు బృందాలు ఒంగోలు రైల్వే ట్రాక్‌లు, ఇతర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. చెన్నై రైల్వే మార్గంలోని ప్రధాన పట్టణాల్లో, గ్రామాల్లో బృందాలుగా ఏర్పడి అన్వేషిస్తున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

తర్వాతి కథనం
Show comments