Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవీ రెడ్డి రాజీనామా.. ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య

ఠాగూర్
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (08:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్‌ కొత్త ఎండీగా ప్రవీణ్ ఆదిత్య నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. కాగా, ఏపీ ఫైబర్ నెట్‌లో భారీగా అవినీతి చోటుచేసుకున్న ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి ఆరోపించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తన చైర్మన్ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఫైబర్ నెట్ ఎండీగా ఉన్న దినేశ్ కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం జీఏడీకి బదిలీ చేసింది. అదేసమయంలో కొత్త ఎండీగా ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ఆదిత్యను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. 
 
గత ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్‌లో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం వాటిపై దృష్టిసారించింది. అదే సమయంలో ఫైబర్ నెట్‌లో చైర్మన్, ఎండీ మధ్య విభేదాల వ్యవహారం కూడా ప్రభుత్వానికి అసహనానికి గురిచేసింది. 
 
దీనికి సంబంధించిన నివేదిక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దకు చేరిన కొద్ది సమయంలో ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం, ఎండీ పదవి నుంచి దినేశ్ కుమార్‌ను తప్పించడం అగమేఘాలపై జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కొత్త ఎండీగా ప్రవీణ్ ఆదిత్యను ప్రభుత్వం నియమించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments