రామ్ గోపాల్ వర్మ ఏదోరకంగా వివాదంలో వుంటూ సోషల్ మీడియాలోనూ బయటా పెద్ద ప్రచారసాధనంగామారిపోయారు. గతంలో వ్యూహం అనే సినిమా తీశాడు. ఆ సినిమా నిర్మాతపైనా ఆరోఫలున్నాయి. దీనిపై శనివారంనాడు ఓ వివరణ ఇచ్చాడు. వ్యూహం సినిమా దాసరి కిరణ్‌కుమార్ నిర్మాత కాగా శ్రీకాంత్ ఫైనాన్స్‌ను అందించారు.
ఇక నా పార్టనర్ రవివర్మ సొంతంగా ఫైనాన్షియర్ శ్రీకాంత్ నుండి ఏపి ఫైబర్ నెట్ ప్రసారహక్కులను కొనుగోలు చేశారు. ఏపి ఫైబర్‌నెట్ రవివర్మనుండి ప్రసార హక్కులను రెండుకోట్ల వ్యయంతో కొనుగోలు చేసింది. కానీ కోటి రూపాయలు మాత్రమే ఎకౌంట్‌కు వచ్చింది. ఇది శ్రీకాంత్, రవివర్మలకు సంబంధించిన ఒప్పందం.
ఈ హక్కులు ఏపి ఫైబర్‌నెట్‌కు 60 రోజులపాటు ఇవ్వబడ్డాయి. ఏపి ఫైబర్‌నెట్ వారు చెప్పిన ప్రకారం లక్షా యాభైవేల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఆ సమయంలో టిడిపిపార్టీ ఎలక్షన్ కమీషన్‌కి కంప్లైంట్ ఇవ్వటంతో ప్రసారాలను నిలిపివేశారు. రవివర్మకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఎమౌంట్‌ను ఏపి ఫైబర్‌నెట్ నిలిపివేసింది.
తన బకాయి మొత్తం చెల్లించనందున నా పార్టనర్ రవివర్మ సివిల్ కోర్టులో కేసు పెట్టారు. అలాగే రవివర్మ పైన, నా పైన తప్పుగా ప్రచారం చేసి మా పరువుకు భంగం కలిగించిన కొన్ని టీవి ఛానల్స్ టీవి5, ఏబిఎన్, మహా టీవి మరియు కొన్ని ఛానల్స్‌పై నష్ట పరిహారం కోసం కేసులు పెడుతున్నాం అని వర్మ తెలిపారు.