Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబ్‌లో చూస్తూ శానిటైజర్ తయారీ - అదే 16 మందికి మృతికి కారణం!

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (11:50 IST)
ఇటీవల ప్రకాశం జిల్లా కురిచేడులో హ్యాండ్ శానిటైజర్ తాగి 16 మంది మృత్యువాతపడిన విషయం తెల్సిందే. అయితే, ఈ మృతులంతా తాగిన శానిటైజర్ రిజిస్టర్ కంపెనీలు తయారు చేసిన శానిటైజ్ కాదు. యూట్యూబ్‌లో చూస్తూ తయారు చేసిన శానిటైజర్ అని విచారణలో తేలింది. 
 
పైగా, ఈ కేసుతో సంబంధం ఉన్న ఐదుగురిని హైదరాబాదులో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో శానిటైజర్ కంపెనీ 'పర్ఫెక్ట్' యజమాని శ్రీనివాస్, ముడిచమురు అందించిన ఇద్దరు మార్వాడీలు, మరో ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున వీరిని కురిచేడుకు తీసుకొచ్చారు. ఒకట్రెండు రోజుల్లో వీరిని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
 
ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. శానిటైజర్ కంపెనీ యజమాని శ్రీనివాస్ కేవలం మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. తొలుత ఒక కిరాణా షాపులో పని చేశాడు. ఆ తర్వాత పర్ఫెక్ట్ కిరాణా మర్చెంట్స్ పేరుతో ఒక దుకాణాన్ని నిర్వహించాడు. లాక్డౌన్ సమయంలో శానిటైజర్లు, మాస్కులను విక్రయించాడు. 
 
వ్యాపారం బాగుండటంతో... సొంతంగా శానిటైజర్ల తయారీని ప్రారంభించాడు. పర్ఫెక్ట్ శానిటైజర్ పేరుతో తయారీని ప్రారంభించారు. దీనికి ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమలుకు కూడా లేవు. అయితే, శానిటైజర్ తయారీలో వాడాల్సిన ఇథైల్ ఆల్కహాల్ బదులు మిథైల్ క్లోరైడ్‌ను వాడటం అతను చేసిన పెద్ద తప్పు. 
 
ఇదే ప్రజల ప్రాణాలు కోల్పోవడానికి ఇదే కారణమనని పోలీసులు నిర్ధారించారు. కురిచేడులో కొన్ని మెడికల్ షాపులకు మాత్రమే శానిటైజర్లు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఒక డిస్ట్రిబ్యూటర్ ఈ మెడికల్ షాపులకు శానిటైజర్లు పంపిణీ చేసినట్టు విచారణలో తెలిసింది. ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments