Webdunia - Bharat's app for daily news and videos

Install App

మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం

Webdunia
ఆదివారం, 15 డిశెంబరు 2019 (12:26 IST)
రాష్ట్ర అసెంబ్లీలో 'దిశ' బిల్లుకు ఆమోదం లభించిన రోజే ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం... త్రిపురాంతకం మండలానికి చెందిన యువతి(19)కి మతిస్థిమితం లేదు. శుక్రవారం రాత్రి 10గంటల సమయంలో బహిర్భూమి కోసం బయటకు వచ్చిన ఆమెను ఇంటి పక్కనే ఉండే అలవాల కరుణాకర్‌రెడ్డి బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఆమె ఎంతకూ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు, బంధువులు వెతకడం ప్రారంభించారు.
 
 
గ్రామంలోని రామాలయం సమీపంలో ఆమెతో పాటు ఉన్న నిందితుడు వీరిని చూసి పరారయ్యాడు. బాధితురాలి పెదనాన్న కుమారుడు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన పోలీసులు గ్రామశివారులోని రైస్‌మిల్లులో దాక్కున్న కరుణాకర్‌రెడ్డిని శుక్రవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం మార్కాపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎర్రగొండపాలెం సీఐ మారుతీకృష్ణ తెలిపారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments