Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజానాట్య మండలి కళాకారుడు డ‌ప్పు భగవంతరావు ఇక‌లేరు!

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (11:59 IST)
ప్రపంచ తెలుగు మహా సభలలో విదేశాలలో ప్రదర్శన లిచ్చిన ప్రజానాట్య మండలి కళాకారుడు డ‌ప్పు భగవంతరావు ఇక లేరు! ఆయ‌న కృష్నా జిల్లా చిట్టూర్పులో తుది శ్వాస విడిచారు. భ‌గ‌వంత‌రావు అనేక దేశాలలో డప్పు ప్రదర్సన లిచ్చారు. అనేక సినిమాలలో ప్రదర్శనలిచ్చారు. అనేక నాటకాలలో డప్పుతో నృత్య ప్రదర్శన లిచ్చిన వాడు, డప్పు వాయిద్యాన్ని శాస్త్రీయంగా రూపొందించినవాడు.
 
 
ఆయ‌న మూడు వేల‌కుపైగా శిష్యులను తయారుచేసి, తను చదువుకోక పోయినా, తనకు తెలిసిన వాయిద్య విద్య‌తో హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో డప్పు వాయిద్య ప్రొఫెసర్ గా పనిచేశారు... కుంపటి సూర్య భగవంతరావు. ఆయ‌న‌ గత రాత్రి గుండెపోటుతో మరణించారు.  ఘంటసాల మండలం చిట్టూ ర్పు గ్రామంలో ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి ప‌లువురు నివాళులు అర్పించారు. 
 
 
అంబేద్కర్, పూలే జాతీయ అవార్డు గ్రహీత దాసి సీతారామరాజు, జాతీయ ఉత్తమ ఉపాద్యాయ అవార్డు గ్రహీత కొక్కిలిగడ్డ మణి ప్రభాకరరావు, దళిత నాయకులు బూసి సుబ్రహ్మణ్యం,మరియు భగవంతరావు శిస్యులు  కల్లివరపు నాంచారయ్య,చాట్రగడ్డ శ్రీనివాసుడు,కొక్కిలిగడ్డ శ్రీను(పాగోలు) తదితరులు నివాళులు అర్పించారు. రేపు హైదరాబాద్ నుండి, దూర ప్రాంతాల నుండి భగవంతరావు శిష్యులు వచ్చాక అంతిమయాత్ర ప్రారంభమౌతుంది అని కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments