Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు

Advertiesment
జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు
, శనివారం, 6 నవంబరు 2021 (11:09 IST)
వైకాపా అధినేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు శనివారంతో నాలుగేళ్లు పూర్తిచేసుకుంది. కడప జిల్లాలోని ఇడుపులపాయలో దివంగత మహానేత వైయస్సార్‌ సమాధివద్ద 2017 నవంబర్‌ 6న ఈ యాత్ర ప్రారంభమై రాష్ట్రంలో 13 జిల్లాలను దాటుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. మొత్తం 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. మొత్తం 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. 
 
క్షేత్రస్థాయిలో రాష్ట్రం నలుమూలలా జగన్‌ పాదయాత్ర చేశారు. ఎండల తీవ్రతను, భారీ వర్షాలను, వణికించే చలిని ఇలా అన్ని కాలాల్లోనూ పాదయాత్ర సాగింది. ప్రతికూల వాతావరణంలోనూ సడలనీయక పాదయాత్ర సాగింది. జనం మధ్యే అడుగు మొదలుపెట్టి.. జనం మధ్యే జగన్‌ విడిదిచేశారు. పాదయాత్ర సమయంలో జనం చెప్పిన సమస్యలు వింటూ, వారి కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగారు. "నేను ఉన్నానంటూ" వారికి ఎనలేని భరోసా నిచ్చారు. చదువు, ఆరోగ్యం కోసం కుటుంబాలు ఆస్తులు అమ్ముకునే పరిస్థితులను తాను చూశానని, ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. వివక్షలేని పాలనను అందిస్తానని హామీ ఇచ్చారు. 
 
ఆ హమీలకు అనుగుణంగానే ఆయన పాలన సాగిస్తున్నారు. అయితే, ఇందుకోసం కేవలం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ళకాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. అనేక అడ్డగోలు నిర్ణయాలతో న్యాయస్థానాలతో మొట్టిక్కాయలు వేయించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు సకాలంలో వేతనాలు చెల్లించలేని పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని నెట్టారు. 
 
అలాగే, రాష్ట్రంలో అనేక హిందూ ఆలయాలను ధ్వసం చేశారు. అదేసమయంలో అనేక క్రైస్తవ చర్చిల నిర్మాణంతో పాటు.. క్రైస్తవ మత ప్రచారం చోరుగా సాగింది. కేవలం క్రిస్టియన్ అనే ముద్ర ఉన్నవారికే కీలకమైన పదవులు కట్టబెడుతున్నారన్న అపవాదును మూటగట్టుకున్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ తమ పార్టీనే గెలవాలన్న పట్టుదలతో దాడులు వంటి అరాచకాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లండన్ స్టోక్‌పార్క్‌లో ముఖేశ్ అంబానీ ఫ్యామిలీ మకాం? రిలయన్స్ వివరణ ఏంటి?