Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ అభిమాని అంత్యక్రియలకు వెళ్లారు... అది చూసి షాక్ అయ్యారు...

సినీ నటుడు ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని ఫ్లెక్సీ కడుతున్న ఓ అభిమాని విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. అతడి బంధువులు శ్మశానవాటిక నుంచి స్నానానికి వెళ్లగా చెరువులో ఓ బాలుడి మృతదేహం చూ

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (10:51 IST)
సినీ నటుడు ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని ఫ్లెక్సీ కడుతున్న ఓ అభిమాని విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. అతడి బంధువులు శ్మశానవాటిక నుంచి స్నానానికి వెళ్లగా చెరువులో ఓ బాలుడి మృతదేహం చూసి షాకయ్యారు. కాకినాడలో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
 
కాకినాడ జగన్నాథపురం అన్నమ్మఘాటీ సెంటర్‌ దుర్గాదేవి వీధికి చెందిన గుత్తుల దుర్గబాబు(34)కు భార్యలక్ష్మి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా అతడు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. దుర్గబాబు హీరో ప్రభాస్‌ అభిమాని. ఆదివారం ప్రభాస్‌ పుట్టినరోజు కావడంతో శనివారం రాత్రి తన ఇంటి సమీపంలో కరెంటు స్తంభం ఎక్కి ఫ్లెక్సీ కడుతుండగా హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. 
 
స్థానికులు దుర్గబాబును 108 వాహనంపై జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ఈ అంత్యక్రియలు ముగించుకుని చెరువులో స్నానానికి వెళ్లగా అక్కడ ఓ పసిబాలుడి మృతదేహాన్ని చూసి వారు షాక్ అయ్యారు. స్థానికంగా ఉండే ఓ వేద పాఠశాలకు చెందిన విద్యార్థిగా ఆ బాలుడిని గుర్తించారు. దీనిపై కాకినాడ వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏఎస్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments