ఏపీ సీఐడీ పీటీ వారెంట్ : పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్

ఠాగూర్
బుధవారం, 12 మార్చి 2025 (09:51 IST)
వైకాపా నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదలయ్యేందుకు అంతరాయం ఏర్పడింది. పోసానిపై సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ వేశారు. ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లారు. పీటీ వారెంట్‌పై పోసాని కోర్టు ముందు హాజరుపరచనున్నారు. జైలు నుంచే వర్చువల్‌గా జడ్జి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసుల్లో ఇప్పటికే లభించింది. దీంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. తాజాగా సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ వేయడంతో పోసాని విడుదలకు బ్రేక్ పడింది. 
 
ఇదిలావుంటే, పోసానికి కర్నూలు కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెల్సిందే. కర్నూలు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోసాని బెయిల్ పిటిషన్‌పై ఐదు రోజుల పాటు కోర్టులో వాదనలు జరిగాయి. 
 
చివరకు రూ.20 వేల పూచీకత్తు, ఇద్దరు వ్యక్తుల జామీనుతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. భవానీపురం కేసులోనూ విజయవాడ కోర్టు పోసానికి బెయిల్ వచ్చింది. దీంతో పోసాని బుధవారం ఉదయం జైలు నుంచి విడుదల కావాల్సివుంది. అయితే, సీఐడీ అధికారులు పీటీ వారెంట్ వేయడంతో ఆయన విడుదలకు అంతరాయం ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments