రాష్ట్ర విభజన ముగిసిన అధ్యాయం : పొన్నం ప్రభాకర్

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (10:23 IST)
రాష్ట్ర విభజన అనేది ఓ ముగిసిన అధ్యాయం అని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. అందువల్ల ఏపీ పాలకులు, ఇటు తెలంగాణ పాలకులు ఇరు ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిపెట్టాలని ఆయన కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్లీ కోరుకుంటున్నామంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ స్పందించారు. 
 
రెండు రాష్ట్రాలు మళ్లీ కలవడం అనే అంశానికి ఇక భవిష్యత్తులో తావు లేదన్నారు. పార్లమెంటులో ప్రజాస్వామ్య పద్దతిలో రాష్ట్రాల ఏర్పాటు జరిగిందన్నారు. దీనిపై సుప్రీంకోర్టులో ఓ కేసు ఉండొచ్చు. ఇంకేవైనా న్యాయపరమైన అంశాలు జరుగుతుండొచ్చు. కానీ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రెండు రాష్ట్రాలు ఏర్పడి, రెండు ప్రభుత్వాలు ఎన్నికైనపుడు మళ్లీ ఉమ్మడి రాష్ట్రం అంటూ కొత్త పల్లవి అందుకోవడం విచిత్రంగా ఉందన్నారు. 
 
సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే తెలంగాణాపై మరోమారు దాడికి కుట్రగానే భావించాల్సి ఉంటుందన్నారు. ఆంధ్రా బాగుండాలి.. తెలంగాణ బాగుండాలి అని కోరుకోవాలి. కానీ వైకాపా ఉమ్మిడి రాష్ట్రం అంటోందంటే తెలంగాణపై మళ్లీ రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తుందనే అర్థం అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

భారతదేశంలో వైభవోపేతంగా అడుగుపెట్టిన హెచ్ అండ్ ఎం బ్యూటీ కాన్సెప్ట్

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

తర్వాతి కథనం
Show comments