Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్‌లో పోలీసుల సేవ‌లు భేష్: డీజీపీ ‌

Webdunia
మంగళవారం, 26 మే 2020 (23:48 IST)
క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌ధ్యంలో లాక్‌డౌన్ అమ‌లు కార‌ణంగా వేర్వేరు సందర్భాలలో మానవత్వం చాటిన పోలీస్ సిబ్బందిని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ అభినందించారు. ఈ సంధర్భంగా డి‌జి‌పి మాట్లాడుతూ పోలీసులు ప్రజల రక్షణలో భాగంగా మాత్రమేన‌ని, కొన్ని సంధార్భాల్లో ప్రజల పట్ల కఠినంగా వ్యహరిస్తారని, ఊదేశపూర్వకంగా ఎప్పుడు ఎక్కడ కూడా వ్యహరించారని తెలిపారు.

పోలీసులకు కూడా అందరిలానే  మానవత్వం ఉంటుందని అనడానికి కొన్ని ఘటనలే నిదర్శనం అన్నారు. కేవలం ఆపదలో ఉన్న వారినే కాదు.. ఇబ్బందుల్లో, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని కూడా కాపాడేవాడు పోలీస్ అని నిరూపించార‌న్నారు.

ఆంధ్రప్రదేశ్ పోలీసులు గత కొన్ని నెలలుగా కరోనా నియంత్రణ చర్యలో భాగంగా కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వల ఆదేశాలకు అనుగుణంగా తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ కంటికి కనిపించని శత్రువుతో పోరాడుతూ చివరకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తూ అనుక్షణం ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నార‌న్నారు. 

మరోపక్క లాక్‌డౌన్‌తో బ్రతుకుదెరువు కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఏపీకి వలస వచ్చిన కార్మికుల యోగక్షేమాలను సైతం  తెలుసుకుంటూ ప్రతిరోజు వారికి కావల్సిన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించార‌ని తెలిపారు. 
 
నిరుపేద కార్మికులకు లాక్‌డౌన్  వేళ‌ అండగా నిలుస్తున్న పోలీసులు వారిని తమ సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారికి  మూడు పూటలా కడుపు నిండా భోజనం పెడుతూ తమ మానవత్వాన్ని చాటుకున్నార‌ని అభినందించారు. నిబంధనల కారణంగా అత్యవసర సదుపాయాలు అందక ఇబ్బందులకు గురవుతున్న సామాన్య ప్రజలకు సైతం బాసటగా నిలుస్తున్నార‌ని కొనియాడారు.

తాజాగా రెండు వేర్వేరు ఘటనలలో ఒకరు రక్తదానంతో మహిళ‌ ప్రాణాలను కాపాడితే, ఇంకొకరు మతి స్థిమితం కోల్పోయి రోడ్డు పక్కన చెత్తకుప్పలో  కొన్ని రోజులుగా పందులతో సావాసం చేస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుర్రవాడిని చూసి చలించిపోయిన పోలీసులు అతనిని కాపాడి, పోలీసులే స్వయంగా స్నానం చేయించి, కొత్తబట్టలు తొడిగి  ఆర్పాన్ హోంలో చేర్పించిన ఘటనలపై డీజీపీ గౌతం సవాంగ్ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినంధించారు. 
 
పోలీ‌సులు మాన‌వ‌త్వం చూపిన తాజా ఘ‌ట‌న‌లు ఇవే....
* భర్త చేతిలో కత్తిపోట్లకు గురైన మహిళ ప్రాణాపాయ స్థితిలోఉండటంతో ఆమెకు ఎస్‌ఐ బాలనాగిరెడ్డి రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని దుర్గాభవాని కాలనీకి చెందిన షేక్‌ జానీని ఆమె భర్త తమ్మిశెట్టి శివ ఆదివారం కత్తితో దాడి చేయడంతో ఆమె కడుపులో నుంచి తీవ్ర రక్తస్రావం కావడం తో  జానీ ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు చికిత్స నిమిత్తం బాధితురాలిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించేందుకు ఆదివారం రాత్రి జీజీహెచ్‌కు వెళ్లిన ఎస్‌ఐ బాలనాగిరెడ్డి ప్రాణాపాయస్థితిలో ఉన్న జానీకి రక్తం కావాలని డాక్టర్లు చెప్పారు. దీంతో స్పందించిన ఎస్‌ఐ బాలనాగిరెడ్డి బాధితురాలికి కావాల్సిన రక్తం దానం చేశారు. అనంతరం వైద్యులు బాధితురాలికి శస్త్రచికిత్స చేయటంతో ప్రాణాపాయం తప్పింది. 
 
* మతి స్థిమితం లేని బాలుడు కొన్ని రోజులుగా  చెత్తకుప్పల మధ్య, పందుల మధ్యే జీవనం సాగిస్తున్నా బాలుడిని గమనించిన విజయనగరం జిల్లా కౌత్తవలస  శృంగవరపుకోట రహదారిలో ఇది గమనించిన కానిస్టేబుల్‌ సురేశ్ ప్రతిరోజూ ఆ బాలుడికి భోజనం తీసుకెళ్లి ఇదే విషయాన్ని సి.ఐ గోవిందరావుకు సమాచారాన్ని అందించడం తో సోమవారం బాలుడిని చెత్త కుప్ప నుంచి చేరదీసి స్నానం చేయించి, కొత్త దుస్తులు వేశారు. ఆపై “బలిఘట్టాం” లోఅనాథలకు ఆశ్రయం కల్పిస్తున్న “హొయినా నంస్థ” కు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments