Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రికిరాత్రే కోటీశ్వరుడైన ఆ పార్టీ నాయకుడు..ఎలా..?

అదృష్టం ఉండాలే కానీ డబ్బులు సంపాదించడం ఓ లెక్కా... కుక్కను కొడితే డబ్బులు వచ్చేస్తాయని కొందరు అంటుంటారు. మరికొందరు రాత్రికిరాత్రే కోటీశ్వరులైపోతారు. డబ్బు సంపాదించడం కూడా సక్రమ మార్గంలో సంపాదించాలే కానీ అక్రమ మార్గంలో సంపాదించకూడదని కూడా చెబుతుంటారు.

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2017 (13:42 IST)
అదృష్టం ఉండాలే కానీ డబ్బులు సంపాదించడం ఓ లెక్కా... కుక్కను కొడితే డబ్బులు వచ్చేస్తాయని కొందరు అంటుంటారు. మరికొందరు రాత్రికిరాత్రే కోటీశ్వరులైపోతారు. డబ్బు సంపాదించడం కూడా సక్రమ మార్గంలో సంపాదించాలే కానీ అక్రమ మార్గంలో సంపాదించకూడదని కూడా చెబుతుంటారు. కానీ కొంతమంది మాత్రం ఏదో విధంగా డబ్బులు సంపాదించేస్తూ ఒక్కోసారి ఆశ్చర్యపోయే రీతిలో రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతుంటారు. అలా అయ్యాడు ఎపికి చెందిన ఒక నేత. హీనస్థితిలో ఉన్న ఆ నేత ఇప్పుడు కోట్లకు పడగెత్తాడు. అధునాతన భవనం, పదిమంది పనిమనుషులు, దర్జాగా ఐదు కార్లు ఇలా ఒక్కటేమిటి రాజభోగం అనుభవిస్తున్నాడు. అయితే ఆ వ్యక్తి గత రెండురోజులుగా ఎవరికీ కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.
 
ప్రకాశం జిల్లా కలిగిరికి చెందిన రామక్రిష్ణారెడ్డి తొలుత వైసిపీలో చేరాడు. అందరిలాగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఉన్నదానితో తృప్తి చెందుతూ వచ్చాడు. అయితే తను క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ గురించి స్నేహితుడు ద్వారా తెలుసుకున్నాడు. ఇంకేముంది రాజకీయాల్లో తనకున్న పరిచయంతో దీని గురించి అందరికీ వివరించాడు. 
 
బిట్ కాయిన్‌లో డబ్బులు పెడితే కోట్ల సంపాదించుకోవచ్చునని ఆశ చూపాడు. కొంతమంది ఇది కరెక్టని నమ్మి డబ్బులు ఇవ్వడం ప్రారంభించాడు. అలా ఒకటి కాదు రెండు కాదు 200 కోట్ల రూపాయలను వసూలు చేశాడు. ఆన్ లైన్లో కొంతమందికి బిట్ కాయిన్‌లో డబ్బులు సంపాదించేలా చేశాడు. కానీ బిట్ కాయిన్ ఒక మాఫియాగా మారుతుండటంతో పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకు ప్రధాన వ్యక్తిగా ఉన్న రామక్రిష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు వచ్చారు. అయితే అప్పటికే వైసిపి నేత రహస్య ప్రదేశానికి వెళ్లిపోయాడు. రామక్రిష్ణారెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా ఈయన తమిళనాడులో వైసీపి సేవాదళ్ ప్రతినిధిగా వుంటున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్డ్జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

ప్రముఖ సినీ గేయరచయిత కులశేఖర్ ఇకలేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments