Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు పేకాట ఆడుతూ కనిపించారు.. పోలీసులు ఏం చేశారంటే?

Webdunia
మంగళవారం, 28 మే 2019 (12:17 IST)
విశాఖ జిల్లా అరిలోవలో పేకాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేసారు. దాడి చేసిన పోలీసులకు కొంతమంది మహిళలు పేకాడుతూ కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై వారిపై కేసు పెట్టి వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడిచిపెట్టేశారు. 
 
ఈ సందర్భంగా ఆ మహిళల సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పరిశీలించగా అనేక విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. పేకాట కేసులో పట్టుబడిన మహిళల్లో కొందరు గంజాయి రవాణా, వ్యభిచారం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించినట్టు సమాచారం.
 
దీనిపై పోలీసులు ఇప్పటికే తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా దీని గురించి రహస్యంగా మరింత లోతైన విచారణ జరపాలని సీఐని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రామకృష్ణాపురంలో పేకాటడుతున్న కొంతమంది మహిళలను ఆరిలోవ పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదుచేశారు. 
 
అయితే మహిళలకు సంబంధించిన విషయం కావడంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం గుట్టుగా దీనికి సంబంధించిన తీగను లాగుతున్నట్టు తెలిసింది. దీనిపై సీఐ అశోక్‌కుమార్‌ వద్ద ప్రస్తావించగా అలాంటిదేమీ లేదంటూ సమాధానం దాటవేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments