Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యకు గుండు గీయించి - అట్లకాడతో వాతలు పెట్టి ...

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (13:43 IST)
విశాఖపట్టణంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన దివ్య కేసులో పలు దిగ్భ్రాంతిక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్న వయసులోని తల్లిదండ్రులను కోల్పోయి, అనాథగా మారిన దివ్యను.. అక్కున చేర్చుకున్నవారు, అయినవారు అష్టకష్టాలు పెట్టారు. చివరకు గుండు గీయించి, కను రెప్పలు కత్తిరించి, అట్లకాడతో వాతలుపెట్టి ఇలా పలు రకాలైన చిత్ర హింసలు పెట్టి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.
 
ఇటీవల విశాఖలో దివ్య అనే ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెల్సిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో విస్మయపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దివ్య మృతదేహంపై 33 గాయాలు ఉన్నట్టు పోస్టుమార్టంలో వెల్లడవడాన్ని బట్టి చూస్తే నిందితులు ఆమెను ఎంత క్రూరంగా హింసించిందీ అర్థమవుతుంది. 
 
అసలు దివ్య హత్యకు ప్రధాన కారణం తాను వేరొక చోటకు వెళ్లిపోతానని ఆశ్రయం కల్పించిన మహిళకు చెప్పడమే ఆమె పాలిట శాపంగా మారినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... 
 
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన దివ్య (22) తల్లిదండ్రులు, ఆమె సోదరుడు, అమ్మమ్మ నాలుగేళ్ల కిందట హత్యకు గురయ్యారు. దీంతో దివ్య ఆమె పిన్ని క్రాంతివేణి వద్ద ఉండేది. 
 
కొన్నాళ్ల కిందట అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిని దివ్య ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత అతడితో విడిపోయి ఏడాది కిందట విశాఖకు రాగా, అక్కయ్యపాలెం చెక్కుడురాయి ప్రాంతానికి చెందిన గుట్టల వసంత అలియాస్‌ జ్యోతి పరిచయమైంది.
 
దివ్య నిస్సహాయతను గుర్తించిన వసంత, ఆమె సోదరి మంజు కలిసి దివ్యను వ్యభిచార వృత్తిలోకి దించారు. అలా కొంతకాలం దివ్యకు వచ్చే డబ్బులు పంపకంలో తేడాలు రావడంతో తాను బయటకు వెళ్లిపోతానని వసంతకు చెప్పింది. 
 
దీంతో ఆమెను కొద్ది రోజుల క్రితం తన ఇంట్లోని ఒక గదిలో బంధించింది. తన సోదరి మంజుతోపాటు మామయ్య వరసయ్యే మరొక వ్యక్తితో కలిసి దివ్యకు గుండు గీయించింది. ఆమె కనురెప్పలు కత్తిరించారు. అట్లకాడతో వాతలు పెట్టి, తిండి కూడా పెట్టక పోడంతో దివ్య గురువారం ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 
 
దివ్య మృతి చెందడంతో అదేప్రాంతానికి చెందిన అంతిమ యాత్ర వాహనం నడిపే వ్యక్తిని వసంత సంప్రదించింది. అతడికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం వెలుగుచూసింది. 
 
కాగా, రావులపాలెం నుంచి దివ్య పిన్ని క్రాంతివేణి శనివారం రావడంతో దివ్య మృతదేహానికి కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. దివ్య శరీరంపై 33 చోట్ల గాయాలున్నట్లు తేలగా, వీటిలో చాలావరకు అట్లకాడతో పెట్టినవే కాగా, చపాతీ కర్రతో కొట్టడం మరికొన్ని బలమైన గాయాలైనట్లు పోలీసులు భావిస్తున్నారు. వసంత, మంజులను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments