Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరీటాల దొంగ దొరికాడు... అక్కడికెళ్లి పట్టుకొచ్చారు...

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (12:20 IST)
గత శనివారం తిరుపతి నగరంలోని గోవిందరాజ స్వామి ఆలయంలో మూడు కిరీటాలు కనిపించకుండా పోయిన విషయాన్ని గుర్తించిన ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ కేసును వీలైనంత త్వరగా ఛేదిస్తామని తెలిపిన పోలీసులు ఆరు బృందాలను ఏర్పాటు చేసి, దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందుకోసం ఆలయాన్ని కూడా మూసివేసి రహస్య విచారణ జరిపారు. 
 
అయితే గుడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా పరిగెడుతూ, చేతిలో ఏవో వస్తువులను తీసుకెళ్లినట్లుగా గుర్తించారు. ఆ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు అతడిని ముత్తయ్యగా నిర్ధారించి, అరెస్ట్ చేసినట్లు సమాచారం.
 
ఇతడు గతంలో కూడా కొన్ని దేవాలయాలలో దొంగతనాలు చేసాడు. కిరీటాలను దొంగిలించాక తమిళనాడు పారిపోయినట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments