జోరుగా పోలవరం జల విద్యుత్ కేంద్రం ట‌న్నెల్ త‌వ్వ‌కం

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (11:09 IST)
భారీగా వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు పోటెత్తుతున్నా, పోలవరం  జల విద్యుత్ కేంద్రం  పనులు శరవేగంగా సాగుతున్నాయి. పోలవరం జలవిద్యుత్ కేంద్రం ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులు  ఇటీవలే ప్రారంభమ‌య్యాయి. జల విద్యుత్ కేంద్రంలో మొత్తం  12 ప్రెజర్ టన్నెల్స్ ఏర్పాట‌వుతున్నాయి. ఇందులో ఒక్కో టన్నెల్ పొడవు 150.3మీ. వెడల్పు 9మీట‌ర్లు. అతి తక్కువ కాలంలోనే రెండవ  టన్నెల్ తవ్వకం పూర్తి చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్ద మిగతా టన్నెల్స్ తవ్వకం పనులు చురుకుగా కొన‌సాగిస్తోంది. 
 
ఇప్పటికే 21,39,639 క్యూబిక్ మీటర్ల కొండ తవ్వకం పనులు మేఘా కంపెనీ పూర్తి చేసింది. పోలవరం జల విద్యుత్ కేంద్రం కొండ తవ్వకం పనులు దాదాపు పూర్త‌య్యాయి. జలవిద్యుత్ కేంద్రంలో 12వెర్టికల్ కల్పన్ టర్బైన్ ,ఒక్కో టర్బైన్ కెపాసిటీ  80 మెగా వాట్లు ఏర్పాట‌వుతున్నాయి. అదే విధంగా 12 ప్రెజర్ టన్నెల్, వీటికి 12జనరేటర్ ట్రాన్స్ఫార్మర్స్ అమ‌ర్చుతున్నారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ 100మెగా వాట్ల కెపాసిటీ తో ఉంటుంది. టన్నెల్ తవ్వకం పనులను జెన్కో ఎస్ ఈ శేషారెడ్డి, ఈ ఈ లు ఏ.సోమయ్య,సి.హనుమ, మేఘా ఇంజనీరింగ్ సంస్ద వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జిఎం ముద్దుకృష్ణ, ఎజిఎం క్రాంతికుమార్,రాజేష్ కుమార్, మేనేజర్ మురళి తదితరులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments