Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావ‌ళి ధ‌మాకా... పిఎం కిసాన్ నిధి రెట్టింపు... ఏటా రైతుకు రూ.12 వేలు

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (19:47 IST)
కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ప్రధాన్ మంత్రి సమ్మాన్ నిధి ద్వారా ప్రతి ఏటా రూ. 6 వేల వరకు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న‌ కేంద్రం ఇపుడు మ‌రో తీపి క‌బురు చెప్ప‌బోతోంది.

 
తాజాగా రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అంటే రైతులకు ప్రతి సంవత్సరం కేంద్రం రూ. 6 వేలను విడతల వారిగా అందిస్తోంది. దానిని రెట్టింపు చేసి, ఇప్పుడు 6 వేలకు బదులుగా రూ. 12 వేలు ఇవ్వనుంది. దీంతో ప్రతి విడతలో రైతులకు రూ. 2 వేలకు బదులుగా రూ. 4 వేలు జమకానున్నాయి. 2021దీపావళీ నాటికి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

 
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు త్వరలో 10వ విడత నగదు అందుకోనున్నారు. పదవ విడత నగదు ట్రాన్స్‏ఫర్ చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు అధికారులు. డిసెంబర్ 15న రైతులకు 10వ విడత నగదు అందించనున్నట్లుగా సమాచారం. ఇప్పటివరకు దేశంలోని 11.37 కోట్ల మంది రైతులకు ప్రభుత్వం రూ.1.58 లక్షల కోట్లను బదిలీ చేసింది. 
 

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 10వ విడతను డిసెంబర్ 15, 2021 నాటికి విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వం గత ఏడాది 25 డిసెంబర్ 2020న రైతులకు డబ్బును బదిలీ చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలను పొందాలనుకునే రైతులు అక్టోబర్ 30 లేదా అంతకు ముందు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ముందు విడత అందుకోకపోతే వాళ్లు చివరి విడత మొత్తాన్ని తర్వాతి విడతతో పాటుగా రూ. 4000 నేరుగా వారి ఖాతాలో పొందుతారు. ఖాతా. నమోదుకు చివరి తేదీ 30 అక్టోబర్ 2021 అని ప్ర‌క‌టించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments