నెల్లూరులో కలకలం.. నేలకేసి కొడితే బంతిలా ఎగురుతున్న కోడిగుడ్లు

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (10:10 IST)
నెల్లూరు జిల్లాలో కలకలం చెలరేగింది. నేలకేసిన కొట్టిన కోడి గుడ్డు ఒకటి బంతిలా పైకి ఎగిరింది. దీంతో ఆ గృహిణి బిత్తరపోయింది. ఆ తర్వాత ఆ గుడ్డు నకిలీదని తేలింది. అంటే జిల్లాలో నకిలీ కోడిగుడ్లు చెలామణి అవుతున్నట్టు తేలింది. గుడ్లు ఎంతకీ ఉడకకపోవడం, నేలకేసి కొడితే బంతిలా ఎగురుతుండడంతో అవి నకిలీ కోడిగుడ్లు అని కొనుగోలుదారులు ఓ నిర్ధారణకు వచ్చారు. 
 
జిల్లాలోని వరికుండపాడులో కొందరు వ్యక్తులు ఆటోల్లో తీసుకొచ్చి కోడిగుడ్లు విక్రయించారు. 30 కోడిగుడ్ల ధర రూ.180 కాగా, తాము రూ.130కి విక్రయిస్తున్నట్టు చెప్పడంతో జనం ఎగబడి కొనుగోలు చేశారు. వాటిని ఉడికించేందుకు ప్రయత్నించగా ఎంతకీ ఉడకకపోవడంతో అనుమానం వచ్చిన ఓ మహిళ వాటిని నేలకేసి కొట్టగా బంతిలా ఎగిరిపడ్డాయి. 
 
దీంతో అవి ప్లాస్టిక్ కోడిగుడ్లుగా భావించి వాటిని కట్ చేయగా లోపల పచ్చగా ఉన్న సొన తెల్లగా ప్లాస్టిక్‌లా ఉండడంతో తాము మోసపోయినట్టు గుర్తించారు. నకిలీ కోడిగుడ్ల వ్యవహారం కలకలం రేపడంతో స్పందించిన పశువైద్యాధికారి వాటిని పరిశీలించారు. వీటిని ల్యాబ్‌కు పంపి పరీక్షలు చేయించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagababu: నా స్మృతివనం శంకుస్థాపన చేయి అంటూ భావోద్వేగానికి గురయిన నాగబాబు

manchu manoj: డేవిడ్ రెడ్డి కాదు రాక్షస రెడ్డి అన్న బ్రిటీషర్స్ ఎందుకంటే...

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ స్టైలిష్ థ్రిల్లింగ్ మూవీగా ఐ యామ్ గేమ్

Mega brothers: మెగా బ్రదర్స్ కలయికగా చిరంజీవి మెగా158 సినిమా ప్రారంభోత్సవం

'మెగా 158' ప్రారంభం... అన్న సినిమాకు క్లాప్ కొట్టిన తమ్ముడు

తర్వాతి కథనం
Show comments