Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్ఈసీ నియామకంపై వేసిన పిటిషన్ విత్ డ్రా... ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (13:17 IST)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్‌లో పూర్తి పత్రాలు లేనందున పిటిషనర్ మూర్తి ఉపసంహరించుకున్నారు. గురువారం నాడు జరిగిన విచారణలో పిటిషనర్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టుకి తెలిపారు.

పూర్తి పత్రాలతో మరోసారి వ్యాజ్యం దాఖలుకు పిటిషనర్ అనుమతి కోరగా.. ఇందుకు హైకోర్టు అంగీకరించింది. దీంతో పిటిషన్ డిస్పోజ్ చేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
 
కాగా.. ఇప్పటికే ఎస్‌ఈసీగా నీలంను కొనసాగించడాన్ని చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పలువురు పిటిషన్‌‌లు వేసిన విషయం విదితమే.

అంతేకాదు.. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అర్థం చేసుకోకుండా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా సాహ్ని రూ.160 కోట్లు వృథా చేశారని, ఆ సొమ్మును ఆమె నుంచి రాబట్టాలని కూడా కోర్టులను కోరడం జరిగింది.

మరోవైపు.. సాహ్ని కొనసాగింపునకు సంబంధించి దాఖలైన వ్యాజ్యంపై విచారణను ఈ నెల 28కి హైకోర్టు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments