Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంచుకొస్తున్న పెథాయ్.. వణికిపోతున్న ఆంధ్రప్రదేశ్

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (09:38 IST)
పెథాయ్ తుఫాను దూసుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెనుముప్పు పొంచివుంది. తిత్లీ తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి ఇపుడిపుడే కోలుకుంటోంది. ఇపుడు మళ్లీ పెథాయ్ తుఫాను దూసుకొచ్చింది.
 
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారితీరం దాటనుంది. దీనికి ఫెథాయ్‌ తుఫానుగా నామకరణం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను మచిలీపట్నం కేంద్రానికి సుమారు 1100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.
 
ప్రస్తుత పరిస్థితిని బట్టి ఒంగోలు నుంచి కాకినాడ మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. దక్షిణ కోస్తాలో ఏ ప్రాంతంలో తీరం దాటినా దాని ప్రభావం కృష్ణా జిల్లాపై ఉండే అవకాశం ఉంది. 
 
దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పొంచి ఉన్న ప్రకృతి విపత్తును ఎదుర్కొని ప్రాణనష్టం లేకుండా సమర్థంగా ఏర్పాట్లు చేసే దిశగా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోంది. పెథాయ్ తుఫాను పెను తుఫానుగా మారితే గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
17వ తేదీ సాయంత్రానికి ఒంగోలు నుంచి కాకినాడ మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ తుఫాను దిశ మార్చకుంటే దక్షిణ కోస్తా వైపు అంటే మచిలీపట్నం నుంచి నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశముందని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments